Home » Malli Pelli : నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ విడుదల… రమ్యకు దించి పడేశాడుగా!

Malli Pelli : నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ విడుదల… రమ్యకు దించి పడేశాడుగా!

by Bunty
Ad

స్వర్గీయ విజయనిర్మల కొడుకుగానే కాక గతంలో కామెడీ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వ్యక్తి నరేష్. కానీ ఈ మధ్య సినిమాల కంటే కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే తరచూ వార్తలో నిలుస్తున్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న నరేష్ ప్రస్తుతం సహనటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. వీరిద్దరి రిలేషన్ పై మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ జరిగిందో తెలిసిందే.

READ ALSO : వెంకటేష్ భార్య నీరజ ఆస్తుల విలువ ఎంతో తెలుసా… ఆమె సీక్రెట్స్ ఇవే?

Advertisement

ఈ కాంట్రవర్సీ కపుల్ లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. నటుడు నరేష్ లీడ్ రోల్ లో యూనిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రానికి ప్రముఖ ఫిలిం మేకర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ఇవాళ ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ చూస్తే నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమూహారమే అని అర్థమవుతుంది. అయితే… సినిమాలో పేర్లు మార్చారు.

Advertisement

READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

Naresh VK Pavitra Lokesh Malli Pelli trailer Unveiled - తెలుగు News - IndiaGlitz.com

నరేంద్ర గా నరేష్, పార్వతిగా పవిత్ర లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు. నరేష్, పవిత్ర లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది? టాపిక్ నుంచి ‘మా’ ఎలక్షన్స్, బెంగుళూరు ఎపిసోడ్& మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ లో అన్నీ చూపించారు. మేడం (విజయనిర్మల) కొడుకు నరేంద్ర అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ వింటుంటే… ఎటువంటి మొహమాటలకు పోలేదని తెలుస్తోంది. డైలాగుల్లో కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా చోటు చేసుకున్నాయి.

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

Visitors Are Also Reading