Home » మేజర్ సినిమా షూటింగ్ తర్వాత ఆ సీన్ డిలీట్ చేశారట..ఇంతకీ ఆ సీన్ ఏంటి..? ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది…!

మేజర్ సినిమా షూటింగ్ తర్వాత ఆ సీన్ డిలీట్ చేశారట..ఇంతకీ ఆ సీన్ ఏంటి..? ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది…!

by AJAY
Ad

అడవి శేష్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మేజర్. ఈ సినిమా ముంబై ఎటాక్స్ లో తీవ్రవాదుల తో విరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సినిమా కోసం అడవి శేష్ చాలా కష్టపడ్డాడు.

Advertisement

Advertisement

ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి అడవి శేష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయట బయటపెట్టాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ బార్డర్ లో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఇండియా నుండి రేడియో సిగ్నల్స్ వచ్చేవి కాదట. కానీ పాకిస్తాన్ రేడియో సిగ్నల్స్ అక్కడికి వచ్చేవట.

వాళ్ళు బాలీవుడ్ సినిమాల పాటలను ఎక్కువగా వినేవారట. దాంతో సందీప్ ఉన్ని కృష్ణన్ పాకిస్తాన్ రేడియో స్టేషన్ నెంబర్ కు ఫోన్ చేసి నేను ఇండియన్ అని చెప్పి తనకు నచ్చిన పాటని ప్లే చేయమని కోరేవారట. ఇక దీనిని సినిమాలోనూ చిత్రించారు. కానీ ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయో అని సినిమా నుండి ఆ సీన్ ను తొలగించినట్టు అడవి శేష్ వెల్లడించారు.

Visitors Are Also Reading