మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుణశేఖర్ డైరెక్షన్లో 2003లో విడుదలైన ఒక్కడు మూవీ. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు.. అయితే ఈ సినిమాకు ఆ కామెడీ మాత్రం ఆకర్షణగా నిలిచింది. అదే ఏంటయ్యా అంటే ధర్మవరపు మరియు మహేష్ బాబు అతని ఫ్రెండ్స్ గా నటించే నటుల మధ్య సాగిన ఈ కామెడీ సన్నివేశం సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. ఆ కామెడీకి సంబంధించిన వివరాలు విశేషాలు చూద్దాం.. ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్పోర్టు ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటారు.
Advertisement
also read:ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? బయ్యర్ల డిమాండ్ పై పూరీ ఫైర్ ఆడియో వైరల్..!
అయితే భూమికకు పాస్పోర్ట్ కోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యంను మహేష్ మరియు అతని ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారు. అందులో కీలకంగా అందరికీ నవ్వు తెప్పించే అంశం ఫోన్ నెంబర్. కొత్తగా సెల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన ప్రేయసికి నెంబర్ చెబుతాడు. ఫస్ట్ టైం ఈ ఫోన్ కి నువ్వే ఫోన్ చేయాలని ఆమెకు చెబుతాడు. తన ప్రేయసి ఆ నెంబర్ చెప్పే సమయంలో మహేష్ గ్యాంగ్ ఆ నెంబర్ వింటారు. ఆ తర్వాత పాస్పోర్టు కోసం టోనీ అనే పేరుతో ధర్మవరపును విసిగించడం చాలా సరదాగా సాగుతుంది.
Advertisement
ఇందులో ధర్మవరపు చెప్పే నెంబర్ “9848032**9” అనే నెంబర్ కు పదేపదే ఫోన్ చేస్తూ సుబ్రహ్మణ్యన్ని విసిగిస్తూ ఉంటారు. దీంతో సుబ్రహ్మణ్యం వెంటనే పాస్పోర్ట్ ఇస్తారు. కట్ చేస్తే మరి ఈ నెంబర్ ఎవరిది అని అనుకుంటున్నారా. సినిమా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజుదేనట. ఇందులో ఎవరి నెంబరు ఉపయోగిద్దాం అనుకునే సమయంలో ఎవరిదో ఎందుకు నిర్మాతదే వాడుకుందామని సలహా ఇవ్వడంతో, ఆ నెంబర్ సినిమాలో ఉపయోగించారు.ఆ తర్వాత ఈ నెంబర్ కు లక్షలాది ఫోన్ కాల్స్ వచ్చాయట. దీంతో నిర్మాత నంబర్ తీసేశారట.
also read: