ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరో హీరోయిన్లకు సంబంధించిన కొంతమంది డూపులు ఉంటారు.. కొన్ని పాత్రలను ఆ డూపులను పెట్టే చేస్తూ ఉంటారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కు కైకల సత్యనారాయణ డూపుగా చేసేవారని మనం విన్నాం.. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చిరంజీవికి డూప్ చేసిన ఒక వ్యక్తి గురించి వైరల్ గా మారింది మనం చూసాం.. ఇది మరవక ముందే మహేష్ బాబు డూప్ చేసే వ్యక్తి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు..
Advertisement
also read:వందల కోట్లు నొక్కేసి నన్ను ఒంటరి చేశారంటూ కన్నీరు కార్చిన నటి సుధ..!!
Advertisement
అయితే ఆ వ్యక్తి ప్రస్తుతం పీకలోతు కష్టాల్లో, కుటుంబానికి కనీసం తిండి పెట్టలేని పరిస్థితిలోకి వచ్చాడని తన బాధను చెప్పుకుంటున్నాడు.. మరి ఆ విశేషాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.. మహేష్ బాబు హీరోగా నటించిన చాలా చిత్రాలు మహేష్ బాబుకు డూప్ గా చేసే జూనియర్ ఆర్టిస్ట్ శ్రీను జీవితం కష్టాల్లో పడింది.. కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన శ్రీనివాస్ కనీసం కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నాడట. ముఖ్యంగా శ్రీను మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు మూవీ నుంచి డూప్ గా చేస్తున్నరట. ఒక స్టార్ హీరోకు నేను డూప్ గా నటించడం చాలా ఆనందంగా ఉందనీ అంటున్నారు.
లాక్ డౌన్ సమయంలో తనకు మహేష్ బాబు ఫ్యాన్స్ హెల్ప్ చేశారని చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ కి ముందు నెలకు 5 ప్రోగ్రాములు చేసేవాడినని, కానీ ప్రస్తుతం ఏ ప్రోగ్రాములు రావడం లేదని ఆదాయం తగ్గిందని, కనీసం భార్య పిల్లల్ని కూడా పోషించడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.. అయితే దర్శక నిర్మాతలు ఏదైనా పని ఇచ్చి ఆదుకోవాలని ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు శ్రీను.
also read: