Home » వందల కోట్లు నొక్కేసి నన్ను ఒంటరి చేశారంటూ కన్నీరు కార్చిన నటి సుధ..!!

వందల కోట్లు నొక్కేసి నన్ను ఒంటరి చేశారంటూ కన్నీరు కార్చిన నటి సుధ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమ్మ, వదిన, అత్తమ్మగా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సుధ. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయింది. తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టిన సుధా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుందని చెప్పవచ్చు. మొదట ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆమె డబ్బింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదట, కానీ అల్లు రామలింగయ్య చెప్పడంతో తెలుగు నేర్చుకోవడం సొంతంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేయడంతో ఆమెకి అవకాశాలు పెరిగిపోయాయి.

Advertisement

also read:హిట్ 2 సినిమాలో ఈ సీన్ గ‌మ‌నించారా..? మీకూ అదే డౌట్ వ‌చ్చిందా..?

Advertisement

అలా సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ డబ్బు కూడా బాగానే సంపాదించింది.. కానీ ఆ తర్వాత ఆమె కొన్ని వ్యాపారాలు పెట్టడం వల్ల ఆర్థికంగా బలహీనపడింది. ఆమె చాలా నమ్మిన వాళ్లు కొంతమంది మోసం చేయడంతో భారీగా నష్టాలు వచ్చాయట. ఈ టైంలో తన భర్త ఆమెకు అండగా ఉండకుండా వదిలేసి ఫారన్ వెళ్ళిపోయాడని తన మనసులో ఉన్న బాధను బయట పెట్టింది నటి సుధ. ఇక తన కొడుకు కూడా విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో మాట్లాడటం లేదని సుధా ఎమోషనల్ అయింది.

కనీసం ఫోన్ కూడా మాట్లాడకుండా ఎక్కడో ఎవరితోనో సెట్ అయిపోయాడంటూ బాధపడింది. నేను కొన్ని కోట్ల రూపాయలు సంపాదించానని కానీ ఢిల్లీలో ఒక హోటల్ ప్రారంభించడం వల్ల ఆ డబ్బంతా నష్టపోయానని పేర్కొంది. కానీ దేవుడు మనం ఏం చేయాలో ముందే నిర్ణయించి పెడతాడని అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించనని సుధా తెలియజేసింది.

also read:

Visitors Are Also Reading