Home » మ‌హేష్‌ స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..?

మ‌హేష్‌ స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక నెర‌వేర్చ‌డానికి ఇవాళ స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ప‌రుశురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట. మైత్రి మూవీస్ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 12న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిన‌దే. తాజాగా మూవీ మేక‌ర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

తొలుత నుంచి చెబుతున్న‌ట్టే మ‌హేష్ ఊర మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ముఖ్యంగా నా ప్రేమ‌ను దొంగిలించ‌గ‌ల‌వు, నా స్నేహాన్ని దొంగిలించ‌గ‌ల‌వు, నా డ‌బ్బును మాత్రం దొంగిలించ‌లేవు అని మ‌హేష్ చెప్పే డైలాగ్ తో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. విదేశాల‌లో వ‌డ్డీ వ్యాపారం చేసే మ‌హేష్ త‌న ద‌గ్గ‌ర తీసుకున్న అప్పును తిరిగి చెల్లించ‌క‌పోతే అస‌లు ఊరుకోడు. డ‌బ్బు కోసం ఎంత దూర‌మైన వెళ్లేందుకు వెనుకాడ‌డు. అక్కడే చ‌దువుకుంటున్న క‌ళావ‌తి మాస్ట‌ర్స్ ఫినిష్ చేసేందుకు మ‌హేష్ ద‌గ్గ‌ర అప్పు చేస్తుంది. ఆ విధంగా వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌ల‌వుతుంది. ఇలా కొన‌సాగుతున్న త‌రుణంలోనే మ‌హేష్ వ‌ద్ద అప్పు చేసి తిరిగి చెల్లించ‌ని విల‌న్ కోసం మ‌హేష్ భార‌త్‌కు వ‌స్తాడు.

మ‌హేష్‌కు, విల‌న్ స‌ముద్ర‌ఖ‌నికి మ‌ధ్య జ‌రిగే గొడ‌వ ఎక్క‌డికి దారి తీసింది. అస‌లు మ‌హేష్ ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టాడు..? చివ‌రికి విల‌న్ వ‌ద్ద నుంచి అప్పు వ‌సూలు చేశాడా..? లేదా అనేది క‌థగా తెలుస్తోంది. ఈ సినిమా మ‌హేష్ వ‌న్ మ్యాన్ షో అని ట్రైల‌ర్‌ను బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది. ప‌క్క‌నే ఉన్న వెన్నెల కిషోర్ తో ఉండ‌డం చూస్తుంటే దూకుడు సినిమా గుర్త‌కొస్తుంది. మ‌హేస్ లుక్, హ్యాండ్స‌మ్‌, చార్మింగ్‌గా క‌నిపించాడు. మ‌హేష్‌తో పాటు కీర్తి సురేష్ లుక్ కూడా ఆక‌ట్టుకుంటోంది. థ‌మ‌న్ మ‌రొక సారి త‌న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మైమ‌రిపించాడు. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ప‌డిన క‌ష్టం విడుద‌లైన ట్రైల‌ర్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మే 12న విడుద‌ల‌వుతున్న స‌ర్కారు వారి పాట విజ‌యాన్ని అందుకుంటుందో లేదో అప్ప‌టివ‌ర‌కు వేచి చూడాలి.

Also Read : 

F3Movie : ఎఫ్‌-3 ట్రైల‌ర్ విడుద‌ల‌కు సిద్ధం.. ముహూర్తం ఎప్పుడంటే..?

ప్రాంక్ లొల్లి..గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్ పై దేవినాగవల్లి ఫైర్…వీడియో వైరల్…!

Visitors Are Also Reading