Telugu News » Blog » Akhanda collection’s : బాలయ్య అరాచకం…బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ ఊచకోత…!

Akhanda collection’s : బాలయ్య అరాచకం…బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ ఊచకోత…!

by AJAY
Ads

నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటించి అలరించాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా అఖండ కావడంతో సినీ ప్రియులు దృష్టి మొత్తం ఈ సినిమాపైనే ఉంది. నిన్న ఈ సినిమా విడుదల కాగా థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం బాలయ్య అఖండ జోరు చూపించాడు.

Advertisement

Balayya akhanda movie collection’s

సాధారణంగా ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో బాలయ్యకు కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ అఖండ సినిమా మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 2021 లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. 2021లో తెలుగులో విడుదలైన వకీల్ సాబ్ సినిమా మూడు లక్షల డాలర్లు వసూలు చేసింది. నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా 3.13 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇక ఈ రెండు సినిమాల ప్రీమియర్ షో కలెక్షన్స్ ను ఇప్పుడు అఖండ బీట్ చేసింది.

Advertisement

Balayya

Balayya

ప్రీమియర్స్ మాత్రమే కాకుండా మొదటి రోజు వసూళ్లలో కూడా బాలయ్య ఊచకోత కోస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సైతం అఖండ సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం బాలయ్య అఖండ తెలుగు రాష్ట్రాల్లోనే 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ అఖండ సినిమాకు రావడం ఖాయం అయిపోయింది.

Also Read: ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్… ఎన్టీఆర్ మహేష్ బాబు ఎపిసోడ్ వచ్చేది అప్పుడే…!