Home » మహేష్ బాబు ఫాన్స్ వలెనే “సర్కారు వారి పాట” సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందట ఎలాంగంటే ?

మహేష్ బాబు ఫాన్స్ వలెనే “సర్కారు వారి పాట” సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందట ఎలాంగంటే ?

by Azhar
Ad

మహేష్ బాబు దాదాపుగా రెండున్నర ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ వెండితెర మీద దర్శనం ఇచ్చాడు. ఈ నెల 12న మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నంత భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. విడుదలైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచుకున్న ఈ సినిమా… ఆ తర్వాత మహేష్ రేంజ్ సినిమా కాదంటూ ప్లాప్ టాక్ కు వచ్చేసింది. అయితే ఈ సినిమా ప్లాప్ కు మహేష్ ఫ్యాన్స్ కారణం అని తెలుస్తుంది.

Advertisement

ఎలా అంటే… సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ ఉన్నంత యాక్టివ్ గా మరో హీరో ఫ్యాన్స్ ఉండరు అనేది నిజం. అయితే వీరు టాలీవుడ్ లో ఏ పెద్ద హీరో సినిమా విడుదల అయిన.. ముఖ్యంగా అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా ఎవ్వరి సినిమా వచ్చిన దాని పైన ట్రోలింగ్ కు దిగేస్తుంటారు. అందులో చిన్న చిన్న తప్పులను వెతుకుతూ… ఆ సినిమా ప్లాప్ అంటూ పోస్ట్స్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ హీరోల అభిమానులకు.. మహేష్ అభిమానులకు ఎప్పుడు సోషల్ మీడియా వార్ జరుగుతూనే ఉంటుంది.

Advertisement

అందువల్ల మహేష్ సినిమా ఎప్పుడు వస్తుంది.. అని ఎదురు చుసిన వేరే హీరోల అభిమానులు… సర్కారు వారి పాట విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో.. తమ ప్రతిభను చూపిస్తున్నారు. వారందరు ఒక్కటై… సర్కారు వారి పాట ప్లాప్ అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. దాంతో కావాలనే తమ సినిమాను ప్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు అని ప్రొడ్యూసర్లు అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఎంత.. ఈ సినిమా హిట్ అని ప్రచారం చేసిన అంది కుదరడం లేదు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపైన కూడా బాగానే కనిపిస్తుంది. మొదటి రోజు 75 కోట్లు కలెక్ట్ చేసిన.. సర్కారు వారి పాట ఆ తర్వాత రోజు బాక్స్ ఆఫిస్ పైన అంతగా ప్రభావం చూపలేదు.

ఇవి కూడా చదవండి :

చెన్నై జట్టునుండి రాయుడి తొలగింపు.. ఎందుకో తెలుసా…?

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading