సావిత్రి.. ఈ పేరు వింటేనే ఆమె అందమైన కళ్ళు,చక్కని ముఖ కదలికలు ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో మహానటి సావిత్రిలా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు అయితే లేరు.. ఆమె నటన,అభినయంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగారో తన చివరి రోజుల్లో అంత దుర్భరమైన పరిస్థితుల్లో చనిపోయారు.. మరి ఇలాంటి మహానటి సావిత్రి చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించినా ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ చిన్న సాయం కూడా చేయలేదట.
Advertisement
దీనికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. సావిత్రి ఏఎన్ఆర్ సరసన దేవదాస్ మూవీ లో నటించిన పార్వతీ పాత్రకు గాను మంచి పేరు వచ్చింది. ఈ మూవీ అప్పట్లో ఘనవిజయం అందుకుంది. దీని తర్వాత సావిత్రి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు,తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోయింది. అంతేకాకుండా అలనాటి మేటినటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కలిసి ఎన్నో చిత్రాలు నటించింది. అలాగే తమిళనాడు స్టార్ నటులైన ఎంజీఆర్,శివాజీ గణేషన్ లాంటి వారి గొప్ప వారితో సినిమాలు తీసింది. తెలుగు ఇండస్ట్రీ సావిత్రి కి పుట్టినిల్లు అయితే తమిళ ఇండస్ట్రీ మెట్టినిల్లు అనేవారు.
also read:జెట్టి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన గోపిచంద్ మలినేని…!
Advertisement
అప్పట్లో సావిత్రి డేట్స్ కోసం స్టార్ దర్శకులు హీరోలు వేచి చూసేవారంటే ఆమె రేంజ్ ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సావిత్రి జీవితంలోకి జెమినీ గణేషన్ వచ్చిన తర్వాత ఎన్నో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంత గొప్పగా ఓ వెలుగు వెలిగిందో చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించిందని ఇండస్ట్రీలో టాక్. అందరూ అనుకున్నట్లు ఆమె చనిపోయే ముందు దుర్భరమైన జీవితం అనుభవించలేదని కుటుంబ సభ్యులు చెబుతారు. సావిత్రి చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కోట్లాది ఆస్తులు తన కూతురు చాముండేశ్వరి, కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది. ఆమె చనిపోయే వరకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదు. దీనికి ప్రధాన కారణం సావిత్రి కి ఉండే మొండివైఖరి అంటారు. అయితే ఆమె జెమినీ గణేషన్ కు దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిందట.
ఈ టైంలోనే అనేక వ్యసనాలకు కూడా అలవాటు పడి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. తన వ్యసనాలు మానుకోవాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్,సావిత్రికి చాలాసార్లు చెప్పారట. కానీ ఆమె మాత్రం వారి మాటను బేఖతరు చేస్తూ తన వ్యసనాలను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్ళింది. మీరు చెప్తే నేను వింటానా అనే విధంగా ప్రవర్తించేదట. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అన్నట్టుగా మొండి వైఖరితో ఉండేదట. ఈ గుణం వల్లే చాలామంది ఆమెకు సహాయం చేయడానికి కూడా వెళ్లేవారు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవరూ కనీసం చూడ్డానికి కూడా వెళ్లలేదని అంటుంటారు. ఇకపోతే నాగ్ అశ్విని దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రంలో ఆమె జీవితంలో అనుభవించే కష్టాలు,మధ్యానికి బానిసైన విధానాన్ని పూర్తిగా చూపించారు.
also read: