Home » priyadarshi:కమెడియన్ “ప్రియదర్శి” విలన్ పాత్రలు కూడా చేశారని మీకు తెలుసా..?

priyadarshi:కమెడియన్ “ప్రియదర్శి” విలన్ పాత్రలు కూడా చేశారని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కమెడియన్ ప్రియదర్శి ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలన్నింటిలో మనకు కమెడియన్ గానే ఎక్కువగా పరిచయమయ్యారు.. అలాంటి కమెడియన్ ప్రియదర్శి కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలో కూడా చేశారని చాలామందికి తెలియదు.. మరి ఆ సినిమాలు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మధ్యకాలంలో ప్రియదర్శి పాపులర్ నటుడిగా పేరు పొందుతున్నారు. ప్రియదర్శి నటించిన మొదటి చిత్రం శ్రీకాంత్ హీరోగా వచ్చిన టెర్రర్.. ఈ సినిమాలో ఈ కమెడియన్ టెర్రరిస్ట్ పాత్రలో నటించారు. దీని తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి మరింత గుర్తింపు సంపాదించారు.

Advertisement

also read:కృష్ణ త‌ల్లిదండ్రులు మొదటిభార్య ఇందిరాదేవిని కాద‌ని విజ‌య‌నిర్మ‌ల ఇంట్లో ఎందుకు ఉండేవారు..?

Advertisement

ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రియదర్శి తండ్రి పులికొండ సుబ్బారావు.. ఆయన గొప్ప కవి.. డాక్టరేట్ కూడా పొందారు. పిడుగురాళ్లలో పుట్టిన ప్రియదర్శి, హైదరాబాదులోనే పెరిగారు. చిన్నతనం నుంచి నటుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. కానీ నటుడు అవ్వడం వాళ్ళ నాన్నకి ఇష్టం లేక తన తండ్రి పనిచేస్తున్న కాలేజీలోనే మాస్ కమ్యూనికేషన్ లో చేరి షార్ట్ ఫిలిం నిర్మాణంలో మెలకువలు నేర్చుకున్నారు. దీని తర్వాత 9,000 జీతానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఇక అప్పటినుంచి ప్రియదర్శి జీవితం టర్న్ అయింది. సినిమాలకు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ ఏ విధంగా అందిస్తారో నేర్చుకున్నారు. ఈ విధంగా సినిమా సర్కిల్లో పెరిగి తానే సొంత కథలు తయారుచేసుకొని వాటిని సినిమాగా చేయాలని భావించారు.

కానీ ఈ ప్రయత్నం అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత తన నటన జీవితాన్ని ప్రారంభించాడు ప్రియదర్శి.. ఆయన మొదటిసారి నటించిన సినిమా టెర్రర్. ఇందులో నెగిటివ్ రోల్ లో కనిపించారు. దీని తర్వాత తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు మూవీలో అవకాశం ఇవ్వడంతో కమెడియన్ గా అదరగొట్టారు. ఆ తర్వాత బొమ్మలరామారం సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించారు. అయితే ప్రియదర్శి ప్రముఖ నటులైన కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజు లాగా కమెడియన్, విలన్ పాత్రలు చేయాలనుకుంటే సాధ్యం కాలేదు. దీంతో కమెడియన్ గానే సెట్ అయిపోయారు.

also read:

Visitors Are Also Reading