Home » క‌ర్నాట‌క‌లో నిన్న హిజాబ్ వివాదం.. ఇవాళ లౌడ్ స్పీక‌ర్ల ర‌చ్చ‌..!

క‌ర్నాట‌క‌లో నిన్న హిజాబ్ వివాదం.. ఇవాళ లౌడ్ స్పీక‌ర్ల ర‌చ్చ‌..!

by AJAY
Ad

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక‌టైన క‌ర్నాట‌క‌లో రోజుకొక వివాదం పుట్టుకు వ‌స్తుంది. ద‌క్షిణ భార‌త రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో పాల‌న చేస్తున్న రాష్ట్రం ఇది ఒక్క‌టే కావ‌డం విశేషం. ఇక్క‌డ‌ ఓ వివాదం ముగిసిపోగానే మ‌రొక వివాదం తెర‌పైకి వ‌స్తుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు హిజాబ్ వివాదం దేశాన్ని ఓ కుదుపు కుదుపేసింది. క‌ర్నాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెర‌ప‌డింది.

Advertisement

తాజాగా లౌడ్ స్పీక‌ర్ల వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ముస్లిం ప్రార్థ‌నాల‌యాలు మ‌సీదుల‌పై ఉన్న మైకుల‌ను తొల‌గించాల‌న్న వాదన తీసుకొచ్చారు. ఈ వాద‌న‌ను మిత‌వాదులు బ‌లంగా వినిపిస్తున్నారు. విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ వివాదం స‌ద్దుమ‌ణిగేలోపు లౌడ్ స్పీక‌ర్ల అంశం తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌సీదుల‌లో ప్రార్థ‌న‌ను మైకుల ద్వారా ప్రసారం చేయ‌డాన్ని నిలిపి వేయ‌క‌పోతే అవే స‌మ‌యాల్లో తాము హిందూ ఆల‌యాల్లో ఓం న‌మఃశివాయ‌, జై శ్రీ‌రామ్, హ‌నుమాన్ చాలీసా ఇత‌ర ఆధ్యాత్మిక ప్ర‌సంగాల‌ను ప్ర‌సారం చేస్తాం అని ఆయా సంస్థ‌లు హెచ్చ‌రించాయి.

Advertisement


ఈ వాద‌న‌కు క‌ర్నాట‌క మంత్రి ఈశ్వ‌ర‌ప్ప కూడా సానుకూలంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ అంశంపై భ‌జ‌రంగ్ ద‌ళ్ నేత భ‌ర‌త్ శెట్టి మాట్లాడారు. హ‌నుమాన్ చాలీసాను ప్ర‌సారం చేసేందుకు ఇది పోటీ కాదు. ముస్లింలు ప్రార్థ‌న చేసేందుకు నాకేమీ అభ్యంత‌రం కాదు. కానీ అదే స‌మ‌యంలో మైకుల ద్వారా ఆల‌యాలు, చ‌ర్చీల‌లో కూడా అప్పుడు మ‌తాల మ‌ధ్య వివాదానికి దారి తీస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అందువ‌ల్ల మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మం చేప‌ట్టినట్టు చెప్పారు.

Visitors Are Also Reading