Home » ఐపీఎల్ లో కొత్త రికార్డు నెలకొల్పిన గుజరాత్ బౌలర్..!

ఐపీఎల్ లో కొత్త రికార్డు నెలకొల్పిన గుజరాత్ బౌలర్..!

by Azhar
Ad
ఐపీఎల్ 2022 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ – గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు బౌలర్ లాకీ ఫెర్గూసన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే గత మ్యాచ్ లో ఆడని ఫెర్గూసన్ ఈ మ్యాచ్ లోనే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో లాకీ ఫెర్గూసన్ వేసిన ఓ బంతి ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో అత్యంత వేగవంతమైన బంతిగా నిలిచింది.
అయితే ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.. క్రమం తప్పకుండ 150 కీ.మీ వేగంతో బంతులు వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఆ మ్యాచ్ లో వేగవంతమైన డెలివరీ అతడిదే ఉండేది. అలాగే ఈ మ్యాచ్ ముందు వరకు కూడా ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో అతడిదే అత్యంత వేగవంతమైన బంతి. ఉమ్రాన్ గంటకు 157 కీ.మీ వేగంతో బంతిని వేసి ఆ రికార్డును నెలకొల్పాడు. కానీ ఈ మ్యాచ్ తోనే జట్టులోకి వచ్చిన ఫెర్గూసన్ ఆ రికార్డును బ్రేక్ చేసాడు.
ఈ మ్యాచ్ లో 5 ఓవర్ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్.. ఆ ఓవర్ ఆఖరి బంతికి 157.3 కీ.మీ వేగంతో బంతిని విసిరాడు. దాంతో ఇప్పటివరకు ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి.. ఐపీఎల్ 2022 సీజన్ లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్ గా నిలిచాడు. అయితే నేటి ఫైనల్స్ గుజరాత్ లోని అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ గుజరాత్ బౌలర్ దెబ్బకు రాజస్థాన్ 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

Advertisement

Visitors Are Also Reading