Home » బాలయ్య దిపాత్రాభినయం చేసిన సినిమాల లిస్ట్.. ఇందులో అది చాలా స్పెషల్..!!

బాలయ్య దిపాత్రాభినయం చేసిన సినిమాల లిస్ట్.. ఇందులో అది చాలా స్పెషల్..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య అంటే తెలియని వారు ఉండరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అలాంటి బాలయ్య ఇప్పటికే చాలా సినిమాల్లో దీపాత్రాభినయం చేశారు.. మరి ఆ సినిమాల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 1988లో కే మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన రాముడు భీముడు సినిమాలో బాలయ్య డబల్ రోల్ చేశారు.. ఇందులో రాధా,సుహాసిని హీరోయిన్లు గా ఉన్నారు..1991లో వచ్చిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర మూవీలో మొదటి పార్ట్ లో హరిచ్చంద్రుడి పాత్రలో, రెండో పార్ట్ లో దుష్యంతుడు పాత్రలో అద్భుతంగా నటించాడు బాలయ్య. దీనికి దర్శకుడు ఆయన తండ్రి కావడం విశేషం..

Advertisement

also read:పవన్ కళ్యాణ్ చిత్రానికి టైటిల్ మార్పు.. అందుకోసమేనా ?

అంతేకాకుండా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన ఆదిత్య 369 మూవీలో కూడా శ్రీకృష్ణదేవరాయల పాత్ర మరియు సాధారణ మానవుని పాత్ర చేసి అందరిని మెప్పించాడు. అంతేకాకుండా 1995 లో రిలీజ్ అయిన కోదండరామిరెడ్డి డైరెక్టర్ చేసిన మాతో పెట్టుకోకు అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ మరియు సాధారణ మానవుని పాత్రలో నటించారు బాలయ్య. 1996లో విడుదలైన శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో కృష్ణుడిగా, అర్జునుడిగా నటించారు బాలయ్య. 1999 లో రిలీజ్ అయిన సుల్తాన్ మూవీలో ఉగ్ర**గా, అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. 2002లో వి.వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఫ్యాక్షన్ మూవీ చెన్నకేశవరెడ్డి సినిమాలో టైటిల్ రోల్ తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు బాలయ్య.

Advertisement

ఇందులో శ్రేయ, టబూ హీరోయిన్స్. అలాగే అల్లరి పిడుగు సినిమాలో కూడా అల్లరి పాత్రలో మరియు పిడుగు పాత్రలు చేశారు బాలయ్య. 2008లో రిలీజ్ అయిన ఒక్కమగాడు సినిమాలో తాతా మనవడి పాత్రలో నటించారు బాలకృష్ణ. దీనికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన పాండురంగడు సినిమాలో శ్రీకృష్ణుడిగా, భక్తుడు పుండరీకా రంగనాథుడిగా చేశారు బాలకృష్ణ. ఈ మూవీ కూడా 2008 రిలీజ్ అయింది. బోయపాటి డైరెక్షన్లో వచ్చినటువంటి సింహ మూవీలో కూడా డబల్ రోల్ లో చేశారు బాలకృష్ణ.

అంతేకాకుండా పగ ప్రతీకారం, పరమవీరచక్ర, లెజెండ్, అఖండ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశాడు. ఇందులో మరీ ముఖ్యంగా 2012 పరుచూరి మురళి డైరెక్షన్లో వచ్చినటువంటి అధినాయకుడు సినిమాలో బాలకృష్ణ ఏకంగా మూడు పాత్రలో నటించారు. ఆయన కెరియర్ లో ఇన్ని పాత్రల్లో చేయడం మొదటిసారి.. ఈ మూవీ బాలకృష్ణకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా విలక్షణమైన పాత్రలు చేసి బాలకృష్ణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading