Telugu News » Blog » పవన్ కళ్యాణ్ చిత్రానికి టైటిల్ మార్పు.. అందుకోసమేనా ?

పవన్ కళ్యాణ్ చిత్రానికి టైటిల్ మార్పు.. అందుకోసమేనా ?

by Anji
Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా  పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సైన్ చేసిన సినిమాలన్నింటిని త్వరగా పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రెండు దశాబ్దాల కిందట పక్కన పెట్టిన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కి పదునుపెడుతున్నారు పవన్ కళ్యాణ్. 

Advertisement

ఇటీవల యంగ్ దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా హరీష్ శంకర్ సినిమా సంబంధించి ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇది వరకే హరీష్ తో పవన్ గబ్బర్ సింగ్ తీసి సూపర్ హిట్ సాధించారు. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీకి పవన్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో ఈ సినిమాకి బ్రేక్ పడిందనుకున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ త్వరలోనేప్రారంభిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. 

Advertisement

Also Read :  జీవితంలో అన్ని స‌మ‌స్య‌లు దానివల్లే..పూరీ జ‌గ‌న్నాత్ కామెంట్స్ వైరల్..!

మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ బదులుగా ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరో టైటిల్ ని ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఉపశీర్షికను జోడించింది. ఇవాళ ఉదయమే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింటూ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చేశారు. ఈసారి వినోదానికి మించినదంటూ టైటిల్ పోస్టర్ విడుదల చేసింది. ఒక చేతిలో హార్లీ డేవిడ్ సన్ బైక్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని పవర్ పుల్ లుక్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్యాక్ గ్రౌండ్ విద్యుత్ వైర్లు, కరెంట్ తయారు చేసే పరిశ్రమలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో మెరుపుల మధ్య టైటిల్ ని పెట్టడం కాస్త డిఫరెంట్  గానే ఉంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆదివారం ఉదయం పవన్ ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టైటిల్ పోస్టర్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ లుక్ చూసి ఒక్కసారిగా సంబురపడిపోతున్నారు.

Advertisement

Also Read :   కృష్ణ వ‌ర్సెస్ రామోజీరావు మ‌ధ్య విభేదాలు ఎందుకు వ‌చ్చాయి..? ఈనాడు అలాంటి ప్ర‌క‌ట‌న ఎందుకు చేసింది..?