Home » సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

by Anji
Ad

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలే కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అతను మరణించినప్పటి నుంచి ఆయన సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆయన పెళ్లిళ్లు, పిల్లలు, ఆస్తులు, అంత్యక్రియలు ఇలా రోజు ఒకదాని గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి ఓ అంశం మరోమారు వార్తల్లో కనిపిస్తుంది. 

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ తన కన్న కొడుకును సైతం కాదనుకొని కృష్ణ రెండో భార్య విజయ నిర్మల చనిపోయిన తరువాత తనతో ఎలాంటి బంధంలేని నరేష్ కుటుంబంతో ఉంది అంటూ సోషల్ మీడియాలు పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కే.తో కృష్ణ ఒకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో కృష్ణ ఇలా సమాధానం చెప్పాడు. నరేష్ అంటే తనకు చాలా ఇష్టం అని, అందుకు గల ముఖ్య కారణం తనకు ఎలాంటి అవసరం వచ్చిన క్షణాల్లో అది చేసి పెట్టేది కేవలం నరేష్ మాత్రమే అని వెల్లడించారు. అంతేకాదు.. అతను షూటింగ్ లో ఉన్నా కూడా తన కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడని, ఫోన్ చేయగానే పరుగెత్తుకుంటూ వస్తాడని తెలిపాడు.

Advertisement

Also Read :   పవన్ కళ్యాణ్ చిత్రానికి టైటిల్ మార్పు.. అందుకోసమేనా ?

Manam News

మహేష్ బాబు సూపర్ స్టార్ అయిపోయాడు బిజీగా ఉంటాడు. అతనికి సంబంధించిన పనులను అన్ని నమ్రత చూసుకుంటుంది. తాను కూడా ఆమెకు భారంగా ఉండలేకపోయాడనేది వినిపిస్తున్న మాట. అందుకోసమే విజయ నిర్మల మరణించిన తరువాత కూడా నరేష్ అతని బాగోగులను దగ్గర ఉండి చూసుకున్నాడు. నరేష్ విషయానికొస్తే అతడి పేరులో సైతం నరేష్ విజయ కృష్ణ అంటూ జత చేసుకున్నాడు. చాలా మందికి మహేష్ బాబుపైన ప్రేమతో నరేష్ ని ఇష్టపడరు కానీ చనిపోయే వరకు విజయ నిర్మల కృష్ణ అంటే ఎంతో ప్రేమగా, గౌరవంగా ఉండేది. అదే ప్రేమ, గౌరవం కృష్ణకు ఆమె పోయాక నరేష్ అందిస్తూ వచ్చాడు. ఆమె లేని లోటు కూడా తెలియకూడదని ఆరాటపడ్డాడు. ఒంటరితనం అతడిని బాధ పెడుతున్నప్పటికీ మాత్రం నరేష్ చేయాల్సింది అంతా చేసేశాడు. దీంతో నరేష్ కాస్త కృష్ణకి దగ్గరి వాడయ్యాడు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read :  పక్కా ప్రణాళికతోనే యువతిని ఎత్తుకెళ్లిన ప్రేమికుడు.. చివరికీ ఏం జరిగిందంటే ?

Visitors Are Also Reading