నటీనటులు :విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్, గెటప్ శ్రీను, ఆలీ, విష్ణు రెడ్డి, తదితరులు..
డైరెక్టర్: పూరి జగన్నాథ్
నిర్మాతలు : ఛార్మి కౌర్, ఖరన్ జోహార్, పూరి జగన్నాథ్, అపూర్వ మెహతా, హిరు యష్ జోహార్..
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
మ్యూజిక్ డైరెక్టర్: మణి శర్మ, తనిష్క్
మూవీ రివ్యూ:
తెలుగు ఇండస్ట్రీ లో రౌడీ హీరో గా పేరు పొందిన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఆయన తీసిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. దీంతో యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ అమ్మాయిలకైతే కలల రాకుమారుడిగా మారిపోయాడని చెప్పవచ్చు.. అలాంటి యువహీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “లైగర్ ” ఈ చిత్రానికి నిర్మాతలుగా చార్మి, కరణ్ జోహార్, అజయ్ మెహతా లతో కలిసి నిర్మించారు.. ముఖ్యంగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోకి ఎంటరవడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇందులో మైక్ టైసన్ కీలకపాత్రలో చేయడంతో అభిమానుల్లో మరింత క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.. మరి ఇంతకీ ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
కథ :
ఈ సినిమాలో విదేశీయుడైన మైక్ టైసన్ ఇండియా కు వస్తారు.. ఈ క్రమంలో బాలామణి పాత్రలో ఉన్న రమ్యకృష్ణతో ప్రేమలో పడతారు.. వీరికి లైగర్ (విజయ్ దేవరకొండ) పుడతాడు. వీరు కరీంనగర్ లో ఉంటుండగా.. లైగర్ గొప్ప ఫైటర్ గా ఎదగాలని కోరిక ఉంటుంది. దీంతో తన తల్లి రమ్యకృష్ణతో కలిసి ముంబైకి వెళ్తారు.. అక్కడే ధనవంతులైన అమ్మాయి అనన్య పాండేతో ప్రేమలో పడతాడు.. ఇలా ఎంతో కష్టపడి లైగర్ ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకొని అమెరికాకు వెళ్తారు.. ఆ విధంగా మైక్ టైసన్ తన జీవితంలోకి ఎలా వస్తాడు.. ఇలా మైక్ టైసన్ మరియు లైగర్ మధ్య ఏం జరుగుతుంది.. అసలు బాలమణి వెనుక జరిగిన కథ ఏంటి అనేది సినిమాలో కనిపిస్తుంది..
Advertisement
Advertisement
also read: పూరీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్న బెల్లంకొండ..!
టెక్నికల్ వర్క్:
దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాతో అభిమానులు నిరాశ పరిచారని చెప్పవచ్చు.. అంతటి స్టార్ హీరోతో మంచి సినిమాని తెరకెక్కించలేక పోయారని అభిమానుల అభిప్రాయం. కథపై ఎక్కువ దృష్టి పెట్టాడు అయినా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఇందులో సినిమాను కలర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశారు సినిమాటోగ్రాఫర్ విష్ణుశర్మ.. మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు.. ఇక మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమా కు తగ్గట్టు తమ వంతు కృషి చేశాయి.
ప్లస్ పాయింట్స్ :
– విజయ్ దేవరకొండ నటన బాగుంది
– రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ తల్లి కొడుకుల పాత్ర..
–మైనస్ పాయింట్స్ :
–దర్శకత్వం
–స్క్రీన్ ప్లే
–మ్యూజిక్
విశ్లేషణ :
గత కొద్ది రోజులుగా ఎన్నో అంచనాల, అభిమానులు ఆశల మధ్య సినిమా రిలీజ్ అయింది.. కానీ మొదటి రోజే సినిమా కాస్త నిరాశ పరిచిందని చెప్పవచ్చు.. మొదటి భాగం కాస్త ఆకట్టుకున్న, రెండవ భాగం మాత్రం మరీ దారుణంగా ఉంది.. దర్శకత్వం ఏ మాత్రం ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.. భయంకరమైన స్క్రీన్ ప్లే.. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అట్టర్ ఫ్లాప్ గా కనిపిస్తోంది.. ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఇతర సినిమాల్లో చూపించిన విధంగా క్యారెక్టరైజేషన్, డైలాగులు మిస్ అయ్యాడు. మొత్తానికి సినిమా కాస్త గందరగోళంగా సాగింది.
రేటింగ్ :
2/5
also read: