Home » లైగర్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది…రౌడీ ఫ్యాన్స్ కి పూనకాలే…!

లైగర్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది…రౌడీ ఫ్యాన్స్ కి పూనకాలే…!

by AJAY
Ad

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యం లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మి స్వీయ నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్ అపూర్వ మెహతాతో కలిసి నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

Liger first glimpse released

Liger first glimpse released

కాగా తాజాగా ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ ముంబై లో ఉండే ఒక సాధారణ ఛాయ్ వాలా రెజ్లర్ గా ఎలా ఎదిగాడు అన్నది చూపించారు. రెజ్లర్ గా విజయ్ దేవరకొండ కండల దేహంతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా పూరి మార్క్ సీన్లు ఈ గ్లింప్స్ లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ ను తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా పరిచయమవుతున్నాడు. దాంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా రౌడీ హీరో కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading