Home » బాలయ్య పక్కనే ఉన్న ఈ బాబు ఎవరో తెలుసా ? ప్రస్తుతం స్టార్ హీరో..!

బాలయ్య పక్కనే ఉన్న ఈ బాబు ఎవరో తెలుసా ? ప్రస్తుతం స్టార్ హీరో..!

by Anji
Ad

ఈ మధ్య కాలంలో ప్రతీ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓచైల్డ్ ఆర్టిస్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోను చూశారా.. ఈ ఫొటో లో ఉన్న కుర్రాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ స్టార్ హీరో. ఇతను హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలను తీస్తూ తన దైన ముద్ర వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని సక్సెస్ పుల్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. 

Advertisement

నందమూరి కుటుంబం నుంచి కథానాయకుడిగా అడుగుపెట్టి సక్సస్ సాధించారు. ఇటీవలే ఓ సినిమాతో సూపర్ హిట్ కూడా సాధించారు. ఈ హీరోకి ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తను ఎవ్వరో కాదండోయ్.. హీరో కళ్యాణ్ రామ్. దివంగత నటుడు హరికృష్ణ తనయుడు. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు 2003లో మొదటిచూపులోనే సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేసాడు కళ్యాణ్ రామ్. అదే ఏడాది అభిమన్యు అనేే సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేకపోయాయి.  ఇక ఆ తరువాత దర్శకుడు తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన లక్ష్మీకళ్యాణం మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తనను తాను నిరూపించుకున్నాడు కళ్యాణ్ రామ్. 

Advertisement

ఇటీవలే వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో దూసుకెళ్తున్నాడు. గత ఏడాది బింబిసారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఈ ఏడాది వచ్చిన అమిగోస్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇవాళ కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన డెవిల్ టీజర్ ఆకట్టుకుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

Sai Sushanth Reddy : నిశ్చితార్థం చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు..

Visitors Are Also Reading