ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్నిప్రదాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బంగారు తెలంగాణను ఏవిధంగా తయారు చేసుకున్నామో.. బంగారు భారత్ ను కూడా అదేవిధంగా తయారు చేసుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. నారాయణఖేడ్‌లో పర్యటించి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.
Advertisement
Advertisement
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. భారతదేశాన్ని అమెరికా కంటే అద్భుతంగా తయారు చేసుకుందామన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి భారతదేశాన్ని బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెనలు కావాలన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పని చేస్తున్నా ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడదాం.
జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిద్దామన్నారు. తెలంగాణ మాదిరిగానే అభివృద్ధి చేద్దామన్నారు కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని స్పస్టం చేసారు. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు కేసీఆర్. మరొకవైపు జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాలకు నీరు అందాలని ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా నేతలు కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Also Read : IPL 2022 Auction : నికోలస్ పూరన్ కొనుగోలుపై ఎస్ఆర్‌హెచ్ కోచ్ ఏమన్నారో తెలుసా..?