ఐపీఎల్ మెగా వేలంలో వెస్టిండిస్ కీపర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐపీఎల్‌లో ప్రత్యేకంగా ప్రతిభ ఏమి కనబరుచలేదు. కానీ ఎస్ఆర్‌హెచ్ పూరన్ కోసం దాదాపు రూ.11కోట్లు ఖర్చు చేసింది. దీనిపై ఎస్ఆర్‌హెచ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
Also Read : ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోలతో నటించిన ముద్దుగుమ్మలు వీరే…!
Advertisement
ఎస్ఆర్‌హెచ్ తొలుత ఇషాన్ కిషన్, నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశాం. ఇషాన్‌ను ముంబై టీమ్ తీసుకోవడంతో వెస్టిండిస్ ఆటగాడిపై భారీగా పందెం వేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇతర ప్లేయర్ల కోసం వెతకడం ప్రారంభించాం కానీ బెయిర్ స్టో అందుబాటులో ఉన్నాడు. అతను సీజన్ మొత్తం ఉంటాడా లేదా అనుమానం ఉండడంతో ప్రతి మ్యాచ్‌లో అందుబాటులో ఉండే అంతర్జాతీయ వికెట్ కీపర్ మాకు కావాలని పూరన్‌ను తీసుకున్నాం.
Advertisement
భారత్‌లో జరిగిన టీ-20 సిరీస్ ఈ వెస్టిండిస్ ఆటగాడు అద్భుత ప్రదర్శనతో ఎస్ఆర్‌హెచ్‌కు ఉపశమనం కలిగింది. పూరన్ ఈ సిరిస్‌లో 184 పరుగులు చేశాడు. సగటున 61 పైగా ఉంది. మూడు మ్యాచ్‌లలో 60కి పైగా పరులు చరేయడం విశేషం. సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా పూరన్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు నికోలస్ పూరన్ ఐపీఎల్‌లో 33 మ్యాచ్‌లు ఆడి 606 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 22.44గా ఉంది. గత సీజన్‌లో నికోలస్ పూరన్ 12 మ్యాచ్ ల్లో 7.72 సగటుతో 85 పరుగులు చేశాడు. ఈ వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌కు వేలంగా భారీ మొత్తం లభించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.