Telugu News » Blog » LOVE WITH STUDENT : ఫిజిక్స్ పాఠాలు చెప్ప‌మంటే కెమిస్ట్రీ పాఠాలు..చివ‌రికి..!

LOVE WITH STUDENT : ఫిజిక్స్ పాఠాలు చెప్ప‌మంటే కెమిస్ట్రీ పాఠాలు..చివ‌రికి..!

by AJAY
Ads

పాఠాలు నేర్ప‌మని కాలేజీకి పంపింతే ప్రేమ‌పాఠాలు నేర్పించాడు ఓ లెక్చ‌ర‌ర్. దాంతో తల్లి దండ్రుల‌ను సైతం విడిచిపెట్టి అత‌డినో వెళ్లిపోయింది ఆ విద్యార్థిని. అమ్మాయి 17ఏళ్ల‌ మైనర్ కావ‌డం..

Advertisement

నాలుగు రోజులుగా క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లి దండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ ఘ‌ట‌న తిరుప‌తిలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే….తిరుప‌తి గాంధీ రోడ్డులోని చైత‌న్య ఇంట‌ర్ కాలేజీలో ఓ విద్యార్థిని ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయిర్ చ‌దువుతోంది. అయితే అదే కాలేజీలో ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్ గా ప‌నిచేస్తున్న కార్తికేయ ఆ అమ్మాయిని ప్రేమ‌లో ప‌డేశాడు.

Advertisement

Advertisement

ఫిజిక్స్ పాఠాలు చెప్పాల్సింది పోయి కెమిస్ట్రీ పాఠాలు చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. అప్పుడే ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసుకుని వ‌చ్చిన ఆ అమ్మాయి తెలిసీ తెలియ‌ని య‌వ‌సులో అత‌డి మాయలో ప‌డిపోయింది. దాంతో ఆ విద్యార్థిని పీక‌ల్లోతు ప్రేమ‌లోకి దింపాడు. దాంతో ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌క్క‌గా చ‌దువుకున్న అమ్మాయి చ‌దువును ప‌క్క‌కు పెట్టి లెక్చ‌ర్ తో జీవిత‌మే ఇక త‌న గోల్ అనుకుంది. తాను ట్రాప్ లో ప‌డిపోయాన‌ని ఊహించ‌లేక‌పోయింది. ఇక అమ్మాయి త‌ర‌చూ ఫోన్లో మాట్లాడ‌టం ఇంట్లో వాళ్లు గ‌మ‌నించారు.

ALSO READ : షాకింగ్ : అమ్మాయిల వివాహా వ‌య‌స్సు పెంపు

ఫోన్ ప‌క్క‌న పెట్టి బుద్దిగా చ‌దువుకోవాల‌ని మంద‌లించారు. ఆ మ‌రుస‌టి రోజే ఇంటి నుండి విద్యార్థిని వెళ్లిపోయింది. దాంతో కుటుంబ స‌భ్యులు కాలేజీకి వెళ్లి ఆరా తీయ‌గా తోటి విద్యార్థులు ఫిజిక్స్ లెక్చ‌రర్ కార్తికేయ‌తో వెళ్లిపోయింద‌ని చెప్పారు. ఒక్క‌సారిగా ష‌క్ కు గురైన త‌ల్లి దండ్రులు కాలేజీ యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు..పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే బంధువులు స్నేహితుల‌ను ఆరా తీశారు. అయినప్ప‌టికీ విద్యార్థిని ఆచూకీ దొర‌క్క‌పోవ‌డంతో ఆందోళ‌న చెందుతున్నారు.