Home » షాకింగ్ : అమ్మాయిల వివాహా వ‌య‌స్సు పెంపు

షాకింగ్ : అమ్మాయిల వివాహా వ‌య‌స్సు పెంపు

by Bunty
Ad

అమ్మాయిల వివాహా వ‌య‌స్సు పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ వివాహ వ‌య‌స్సు 18 ఉండేది. ఆ వ‌య‌స్సును 21 పెంచాల‌ని కేంద్ర ప్ర భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర మంత్రి మండ‌లి స‌మావేశం లో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బిల్లు ను కూడా వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో ప్రవేశ పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. కాగ అమ్మాయిల వివాహ వ‌య‌స్సు ను 18 నుంచి 21 కి పెంచాల‌న్న డిమాండ్ చాలా రోజుల నుంచి వ‌స్తుంది. 18 ఏళ్ల లో అమ్మాయిలు ఆలోచ‌న విధానం లో పూర్తి స్థాయి లో ప‌రిమాణం చెంద లేదని.. మ‌రో 2 నుంచి 3 సంవ‌త్స‌రాలు వివాహా వ‌య‌స్సు ను పెంచాల‌ని ప‌లువురు మాన‌సిక వైద్యులు కూడా సూచించారు.

Advertisement

Advertisement

అలాగే ప‌లు మ‌హిళా సంఘాలు కూడా వివాహ వ‌య‌స్సు ను 21 పెంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మ‌హిళ ల వివాహం 21 ఏళ్ల లో చేస్తే.. వారికి స్వంతం గా ఆలోచించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే 18 ఏళ్ల లో వివాహం చేస్తే.. వారు త్వ‌రగా గ‌ర్భం దాల్చితే.. అనేక స‌మ‌స్య‌లు ఎదురు అవుతున్నాయ‌ని అంటున్నారు. అందుకే వివాహ వ‌య‌స్సు ను 21 పెంచాల‌ని ఇప్ప‌టి కే చాలా మంది అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కాగ కేంద్ర ప్ర‌భుత్వం తాజా గా తీసుకున్న నిర్ణ‌యం తో అమ్మాయిల వివాహ వ‌య‌స్సు 21 రానుంది.

Visitors Are Also Reading