Home » ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు అంటూ.. బండ్ల గణేష్ పై విజయ సాయి రెడ్డి ఫైర్..!!

ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు అంటూ.. బండ్ల గణేష్ పై విజయ సాయి రెడ్డి ఫైర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ మరియు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. Be first. Be best.. Be different, అలాగే కింద భూమి ఉందని వాస్తవంలో బతుకుతాననే నినాదాలను తన ట్విట్టర్ లో రాసిన బండ్లగణేష్, ఆచరణలో దానికి విరుద్ధంగా వ్యవహరించడం విడ్డూరం. తెలుగుదేశం పార్టీని కమ్మల పార్టీగా అభివర్ణించడాన్ని గణేష్ జీర్ణించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీతో ఏ సంబంధం లేదు ఆయనకు రాత్రివేళ కట్టలు తెంచుకునే అంతా కోపం ఎందుకు వచ్చిందో తెలియదు.

Advertisement

అంటూ విజయసాయిరెడ్డిపై వరుస ట్విట్లతో చెలరేగిపోయాడు. వీటన్నింటికీ సాయి రెడ్డి ఒకే ట్వీట్ తో గట్టి సమాధానం ఇచ్చారు. కమ్మవారిని తిట్టడాన్ని తట్టుకోలేక పోతున్న టువంటి నీవు నీకు నచ్చిన టువంటి వారి పేరు పెట్టి తిట్టు. కానీ కులాన్ని తిట్టకు.. దయచేసి సంస్కారం నేర్చుకో.. నీ బతుకు ఎక్కడినుంచి మొదలైందో మాకు తెలుసు.. ఎంపీగా ఉన్నావని అధికారంలో ఉన్నానని కళ్ళు నెత్తి కెక్కి ప్రవర్తిస్తున్నావు అంటూ గణేష్ తనమార్కు తిట్లతో చెలరేగిపోయారు. ఇంకా దారుణంగా విజయసాయిరెడ్డిని ఆడేసాడు. ఇంత జరిగినా విజయసాయిరెడ్డి ఊరుకుంటాడా.. నీ కంటే నేనేం తక్కువ తిన్నానా అంటూ ఆయన కూడా రీ ట్విట్లతో బండ్లను ఆడుకున్నారు..

Advertisement

 ఆకులు.. వక్కలు… పక్కలు.. ఇదే కదా నీ బతుకు..? అంత ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం.. ఎవరో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన టువంటి వీధికుక్కల చెలరేగిపోయి మొరుగుతున్నావు. అలాగే మొరిగి మొరిగి సొమ్మసిల్లి పోతావు.. ఎప్పుడైనా ఓడలు బండ్లు అవుతాయి కానీ.. బండ్లు ఓడలు కావు.. అయ్యే..గణేశా..? అంటూ వెటకారంగా రాసుకొచ్చారు.. ఇలా వీరిద్దరి మధ్య సాగుతున్న తిట్లపురాణం ఏ విధంగా ముగింపు పలుకుతారో వేచి చూడాలి..

ఇవి కూడా చదవండి :

బాల‌కృష్ణ‌కు ప్ర‌శాంత్ నీల్‌కు చుట్ట‌రిక‌మేమైన ఉందా..?

కలలో చిన్నపిల్లలు కనిపిస్తే ఏం జరుగుతుందంటే..!!

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు మాట విలువ‌ను కాపాడుకోవాలి

 

Visitors Are Also Reading