చాణక్య ఎన్నో విషయాల్ని, ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే లైఫ్ అంతా కూడా అద్భుతంగా మారుతుంది. చాణక్య కాకి నుండి మనిషి నేర్చుకోవాల్సిన వాటి గురించి కూడా చెప్పారు. మనిషి కాకి నుండి వీటిని నేర్చుకున్నట్లయితే కచ్చితంగా ఇంకా బెటర్ గా ఉండొచ్చుట. కాకికి మొండితనం ఎక్కువ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అనుకున్నది కాకి సాధిస్తుంది. అదే విధంగా జీవితంలో మనుషులు మొండిగా కాకి ప్రవర్తించినట్లు కనుక ఉన్నట్లయితే అనుకున్నది పూర్త చేయగలుగుతారు. ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదని కాకి లైఫ్ చెబుతోంది.
Advertisement
Advertisement
కాకి ఎవరిని అంత తేలిగ్గా నమ్మదు. సురక్షితంగా చుట్టుపక్కల పరిశీలిస్తూ ఉంటుంది. ఎటు నుండి ఎవరి దాడి చేస్తారనేది తెలియదు. మానవులు కూడా ఇది కాకి నుండి నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అందరిని నమ్మేయకూడదు. ఎవరినైనా తెలియకుండా నమ్మి అందులోకి దిగితే కచ్చితంగా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని కాకి చెప్తుంది. జాగ్రత్తగా కాకి కూర్చోవడం తరచుగా చూసి ఉంటారు. కాకి భవిష్యత్తులో జరిగే సంఘటనలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటుంది. అలానే కాకిలాగే దూరదృష్టి కలిగి ఉండాలని కూడా చాణక్య అన్నారు. కాకి చివరి క్షణం దాకా ఓపికగా కూర్చుని సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగుతుంది. ఇది కూడా మనిషి కాకి నుండి నేర్చుకోవాలని చాణక్య అన్నారు.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి
- ఆర్జీవీ సినిమా “వ్యూహం”లో విలన్ ఎవరో తెలుసా? మెగా ఫాన్స్ తో చిచ్చు మొదలు కాబోతోందా?
- నాగార్జున విషయంలో అప్పుడు టబు..ఇప్పుడు అనుష్క అలా చేశారా..!