పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు విడుదలకు ముందు నెట్టింట హల్చల్ సృష్టించాయి. కావాలనే కొంత మంది ఈ సినిమా కీలక ఘట్టాలను లీక్ చేసారు. అదే ఈ చిత్రానికి హైప్‌ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచే విధంగా చేసింది. సరిగ్గా ఇలాంటిదే పవన్ కల్యాణ్ మరొక సినిమా కు జరుగుతుందా అంటే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికీ అనుమానం కలుగకుండా ఉండదు.
Advertisement
పవన్ కల్యాణ్ నటించిన మూవీ భీమ్లా నాయక్ జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఆర్.ఆర్.ఆర్., రాధేశ్యామ్ చిత్రాల కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. భీమ్లానాయక్ మరొకసారి వార్తల్లో నిలిచి హల్ చల్ సృష్టిస్తోంది. ఈసారి ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీక్ కావడంతో ఈ సినిమా నెట్టింట హాట్ టాఫిక్‌గా మారిపోయింది. ఈచిత్రం షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Advertisement
తాజాగా లీక్ అయిన క్లిప్‌లో పవన్ కల్యాణ్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్‌గా పోలీస్ స్టేషన్లో కీలక సన్నివేశంలో కనిపిస్తున్నారు. ఈ సీన్లో పవన్ కల్యాణ్ పవర్ పుల్ డైలాగ్‌లు చెబుతున్న తీరు ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. వకీల్ సాబ్తో సంతోషపడ్డ అభిమానులు పవన్ నుంచి అంతకు మించి కోరుకుంటున్నారు. భీమ్లానాయక్లో వారు కోరుకున్న అంతకు మించి కనిపించబోతున్నది. తాజాగా లీకయిన వీడియోలో అది స్పష్టం అయింది.
మళయాల హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా భీమ్లానాయక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లీక్ అయిన వీడియోతో అభిమానుల్లో భారీ అంచెనాలే నెలకొన్నాయి. పవన్ బాడీ లాంగ్వేజ్‌కు కొత్తగా ఉండడంతో త్రివిక్రమ్ అందించిన డైలాగ్‌లు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండడం ప్లస్‌గా మారింది. రియలిస్టిక్ పంథాలో సాగర్ కె.చంద్ర తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నిర్మించారు. థమన్ అందించిన పాటలు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన డీజే వర్షన్ కూడా ఓ రేంజ్లో పేలింది. తాజాగా లీక్ అయిన వీడియోతో ఆ నమ్మకం మరింత పెరిగినది. మంచిదే అన్నట్టుగా పవన్ సినిమాకు లీక్ ముంచేస్తున్నదని.. ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.