Home » ‘లాలా భీమ్లా’ డీజే మిక్స్ థమన్ మ్యూజిక్ హైలెట్‌..!

‘లాలా భీమ్లా’ డీజే మిక్స్ థమన్ మ్యూజిక్ హైలెట్‌..!

by Bunty
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్‌, ద‌గ్గుబాటి రాణా క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టిస్టార‌ర్ సినిమా భీమ్లానాయ‌క్‌. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం ప‌ర్య‌వేక్ష‌కుడిగా వ్య‌వ‌హిరంచారు. సంక్రాంతి బ‌రిలో నుంచి త‌ప్పుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన సాంగ్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ముఖ్యంగా లాలా భీమ్లా సాంగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. థ‌మ‌న్ మాస్ మ్యూజిక్ అద‌ర‌గొట్టేసారు. ఈ పాట విడుద‌లైనప్ప‌టి నుంచి ఎక్క‌డ విన్నా ఇదే సాంగ్ ప్లే అవుతుంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Advertisement

 

Advertisement

ఇక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఫ్యాన్స్‌లో మ‌రింత జోష్ పెంచేసారు. లాలా భీమ్లా డీజే వెర్ష‌న్‌ను
విడుద‌ల చేసారు. ఈ నూత‌న సంవ‌త్సర వేడుక‌ల‌లో లాలా భీమ్లా డీజేతో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందే అంటూ మేక‌ర్స్ పోస్ట్ చేసారు. నార్మ‌ల్‌గానే బాక్సులు బ‌ద్ద‌లు కొట్టిన థ‌మ‌న్‌. డీజే వ‌ర్ష‌న్ ను ఇచ్చి ప‌డేసాడు. ప్ర‌స్తుతం ఎక్క‌డ విన్నాలాలా భీమ్లా డీజే మారు మ్రోగుతున్న‌ది.

 

Visitors Are Also Reading