Home » గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన లీడ‌ర్ సినిమా హీరోయిన్..ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన లీడ‌ర్ సినిమా హీరోయిన్..ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

కొంత‌మంది హీరోయిన్ లు త‌క్కువ సినిమాలు చేసి ఆ త‌రవాత క‌నిపించ‌కుండా పోతారు. కానీ న‌టించిన ఒక‌టి రెండు సినిమాల‌తోనే ఎంతో గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి న‌టీమ‌ణుల‌లో లీడ‌ర్ సినిమా హీరోయిన్ ప్రియా ఆనంద‌ర్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ రానా హీరోగా న‌టించిన లీడ‌ర్ సినిమాలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. మొద‌టి సినిమాతోనే అందం అభినయంతో పాటూ న‌ట‌న‌తో శ‌భాష్ అనిపించుకుంది.

Advertisement

హైద‌రాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ అమెరికాలోపెర‌గ‌టంతో పాటూ అక్క‌డే చ‌దువు పూర్తి చేసింది. ఆ త‌ర‌వాత అమెరికా నుండి చెన్నై తిరిగి వ‌చ్చి మోడ‌లింగ్ లో చేరింది. లీడ‌ర్ సినిమా విడుద‌ల‌కు ముందే మ‌రో రెండు సినిమాల‌కు ప్రియా ఆనంద్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రియా ఆనంద్ లీడ‌ర్ కంటే ముందు త‌మిళ సినిమా వామ‌న‌న్ తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది.

Advertisement

కాగా టాలీవుడ్ లో మాత్రం లీడ‌ర్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక లీడ‌ర్ త‌ర‌వాత తెలుగులో మ‌రికొన్ని సినిమాల‌లో సెకండ్ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలు ద‌క్కించుకుంది. అయితే ఆ సినిమాలు ఆశించినమేర విజ‌యం సాధించ‌లేదు. ఆ త‌ర‌వాత టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయ్యింది. కానీ త‌మిళంలో సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా త‌మిళంలో ఓ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. అదేవిధంగా మ‌ల‌యాళ‌, క‌న్న‌డ సినిమాల‌లో కూడా ఛాన్స్ లు ద‌క్కించుకుంటోంది. ఇక ప్రియాఆనంద్ ఫ్యూచ‌ర్ లో తెలుగులో అవ‌కాశాలు ద‌క్కించుకుంటుందో లేదో చూడాలి.

ALSO READ :రాజమౌళికి అల్లు అరవింద్ మీద ఎందుకంత కోపం అంటే..ఆ విషయమే చిచ్చు పెట్టిందా ?

Visitors Are Also Reading