టాలీవుడ్ అలనాటి హీరోయిన్ లయ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్గా టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. తెలుగమ్మాయి అయిన లయ భద్రం కొడుకు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. కాగా, లయ స్వయంవరం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత లయ అందం, అభినయానికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.
read also : Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?
Advertisement
స్వయంవరం సినిమా తర్వాత లయకు టాలీవుడ్ లో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె అమెరికాకు చెందిన ఒక డాక్టర్ నీ వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. కొన్నాళ్ల క్రితం ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. వ్యక్తిగత కారణాలతో గ్యాప్ తీసుకున్నారు. లయ పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో మరల ఆమె జాబ్ లో చేరినట్లు తెలుస్తుంది. ఎంప్లాయ్ గా తన లుక్ అట్రాక్టివ్ గా ఉంది.
Advertisement
Read also : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉద్యోగాలు…జీతం రూ. 35 వేలు
ఆమె చాలా ఫిట్ అండ్ స్లిమ్ గా ఉన్నారు. లయ పనిచేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. ఈ ఎయిర్ బస్ సంస్థలో లయ కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారట. అయితే లయ భర్తకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా తిని కూర్చోవడం ఇష్టం లేని లయ తన అభిరుచి మేరకు జాబ్ చేస్తుంది. కాగా, 2006లో అమెరికాలో డాక్టర్ గా స్థిరపడిన గణేష్ గోర్తితో లయ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.
read also : ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !