నందమూరి బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు నందమూరి లక్ష్మీ పార్వతి. ఇవాళ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు నందమూరి లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. బాలకృష్ణ మాట్లాడితే… ఆరునెలల దాకా అర్థం కావడం లేదంటూ చురకలు అంటించారు. హిందూపురం ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు.
READ ALSO : Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?
Advertisement
నారా లోకేష్ పాదయాత్ర రోజుకో కామెడీ బావుందని ఎద్దేవా చేశారు. ప్రతి పక్ష పార్టీ రోజు రోజు కు దిగజారి పోతుందని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమి చేశారో చెప్పాలని.. ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని ఆగ్రహించారు నందమూరి లక్ష్మీ పార్వతి. ప్రభుత్వ వైఫల్యాలను మీరు చెప్పలేని స్థితి, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.
Advertisement
READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్
సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని , ఇలాంటి కుక్కల్ని పోషిస్తున్నారని మండిపడ్డారు నందమూరి లక్ష్మీ పార్వతి. దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టాడు ఈ నల్లధనం స్వదేశానికి రప్పించాలన్నారు. ప్రధాని మోదీ ఈ నల్లధనం బయటకు తీసుకు రావాలని కోరుతున్నానని వివరించారు. పవన్ కళ్యాణ్ చదువుతున్న పుస్తకాలు జ్ఞానం ఎక్కడకి పోయింది.. ప్రజ వ్యతిరేకత అర్థం కాదన్నారు నందమూరి లక్ష్మీ పార్వతి.
READ ALSO : సీఎం కేసీఆర్ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?