Telugu News » Blog » LATHA MANGESHKAR : మ‌ళ్లీ విష‌మంగా ల‌తామంగేష్క‌ర్ ఆరోగ్యం…వైద్యులు ఏమ‌న్నారంటే..!

LATHA MANGESHKAR : మ‌ళ్లీ విష‌మంగా ల‌తామంగేష్క‌ర్ ఆరోగ్యం…వైద్యులు ఏమ‌న్నారంటే..!

by AJAY

క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌తి రోజు దేశంలో ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ సెల‌బ్రెటీలు, ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ను పొట్ట‌న పెట్టుకుంది. ఇక కొద్దిరోజుల క్రితం ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 92 ఏళ్ల ల‌తా మంగేష్క‌ర్ క‌రోనా బారిన ప‌డ‌టంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆ త‌ర‌వాత ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స అందించ‌గా ఆమె కోలుకుంద‌ని క‌రోనా ను జ‌యించిందని వైద్యులు వెల్ల‌డించారు.

Latha mangeshkar

Latha mangeshkar

అయితే మ‌రోసారి ల‌తామంగేష్క‌ర్ ప‌రిస్థితి విష‌మంగా మారింద‌ని వైద్యులు చెబుతున్నారు. ల‌తా మంగేష్క‌ర్ ముంబైలోని బ్రీడ్ కారీడ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా వైద్యుడు ప్ర‌తీత్ సంధాని ఆమె ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించింద‌ని తెలిపారు.వైద్యుల ప‌ర్య‌వైక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నామ‌ని ప్ర‌స్తుతం ఆమె వెంటిలేట‌ర్ పై ఉన్నార‌ని ప్ర‌తీత్ సంధాని వెల్ల‌డించారు. దాంతో ల‌తా మంగేష్క‌ర్ అభిమానులు ఆందోళ‌నచెందుతున్నారు. ల‌తా మంగేష్క‌ర్ ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌ల‌ను పాడారు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించుకున్నారు.

You may also like