Home » TS Lawcet: లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..!

TS Lawcet: లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..!

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. మార్చి 1న లాసెట్, పిజిఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ విసి డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మితో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజిఎల్ సెట్ కు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Advertisement

ఆలస్య రుసుముతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైటును సందర్శించవచ్చని అధికారులు సూచించారు.

Advertisement

ఈ సెట్ షెడ్యూల్ ఇదే..

అదే విధంగా ఈసెట్ షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. మార్చి 1న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, మార్చి 2 నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేసి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

read also : పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు…అస్సలు ఊహించలేదు – లయ

Visitors Are Also Reading