ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి సంబందించిన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. సర్వే నెంబర్ 222 5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు వచ్చారు. ఆ భూమి చంద్రబాబునాయుడు తమ్ముడు అయినటువంటి నారా రామ్మూర్తి నాయుడు పేరిట ఉన్న స్థలంలో రాతి కూసాలు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : Video : బ్యాట్ తో అఖిల్ బాదుడు…వీడియో వైరల్…!
Advertisement
Advertisement
చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 1989లో 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. కుటుంబ భాగ పరిష్కారాల్లో భాగంగా ఆ భూమిని చంద్రబాబు, రామ్మూర్తినాయుడులకు పంచారు. ఆ తరువాత తన వాటాగా వచ్చిన భూమిని ఆసుపత్రి, కల్యాణ మండపానికి చంద్రబాబు వితరణగా ఇచ్చారు. ఇప్పుడు అదే భూమిలో నారా రామ్మూర్తి నాయుడుకు చెందిన 38 సెంట్లలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆ భూమికి సంబంధించి రామ్మూర్తి నాయుడు పేరుపై రిజిస్ట్రేషన్ జరిగినా దానిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వివాదం తలెత్తినట్టు సమాచారం.
మరొక వైపు గుంటూరు పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇవాళ పార్టీ నేతలతో, 12 నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో చంద్రబాబు సమావేశం జరుగనున్నది. గత రెండు, మూడు రోజులుగా టీడీపీ కార్యాలయంలో జిల్లాల వారిగా సమీక్షలు చేపడుతూ కొత్త ఇన్‌చార్జీలను నియమిస్తున్నారు.
Also Read : చెల్లించని చలాన్‌లు రూ.600 కోట్లు.. ఇక జరిమానాలో తగ్గింపు : జాయింట్ సీపీ రంగనాథ్