Home » Video : బ్యాట్ తో అఖిల్ బాదుడు…వీడియో వైరల్…!

Video : బ్యాట్ తో అఖిల్ బాదుడు…వీడియో వైరల్…!

by AJAY

టాలీవుడ్ లో పలువురు హీరోలు కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాకుండా స్పోర్ట్స్ లోనూ టాలెంట్ ను చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా మంది హీరోలు క్రికెట్ ఆడతారు. రామ్ చరణ్,తరుణ్, ఎన్టీఆర్, నవదీప్, అఖిల్ తో పాటు మరికొందరు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక అప్పట్లో సీసీఎల్ సందర్భంగా అఖిల్ క్రికెట్ ఆడి ఎంతోమందిని ఆశ్చర్యపరిచారు.

అంతే కాకుండా అఖిల్ ఆట చూసి అతడు సినిమాల్లోకి కాకుండా క్రికెటర్ గా ఎదుగుతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ అఖిల్ తన పేరునే టైటిల్ గా వివి వినాయక్ దర్శకత్వం లో అఖిల్ అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఆ తరవాత పలు చిత్రాలతో అఖిల్ ముందుకు వచ్చినా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్ ఇప్పటికే నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సినిమా తో అఖిల్ పక్కా హిట్ కొడతాడు అని అక్కినేని అభిమానులు కూడా ఎంతో ధీమా గా ఉన్నారు. ఇదిలా ఉంటే నేడు నాగార్జున వెయ్యి ఎకరాల అడవిని మొక్కలు నాటడానికి దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాగార్జున తో పాటు నాగచైతన్య అఖిల్ కూడా హాజరయ్యారు. అక్కడ అఖిల్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటం తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక అఖిల్ సరికొత్త లుక్ లో జుట్టు పెంచుకుని కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading