Home » VIDEO : బాల‌య్యా మ‌జాకా…ఫస్ట్ టైమ్ థియేట‌ర్ స్క్రీన్ పై లేడీ ఫ్యాన్స్ స్టెప్పులు..!

VIDEO : బాల‌య్యా మ‌జాకా…ఫస్ట్ టైమ్ థియేట‌ర్ స్క్రీన్ పై లేడీ ఫ్యాన్స్ స్టెప్పులు..!

by AJAY
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య‌కు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బాల‌య్య సినిమా వ‌చ్చిందంటే మాస్ ప్రేక్ష‌కుల‌కు పండ‌గే. అంతే కాకుండా బాల‌య్య సినిమా విడుద‌ల అవుతుంద‌టే అభిమానులు ముందే సంబరాలు మొద‌లు పెడ‌తారు. ఇక రీసెంట్ గా బాల‌య్య అఖండ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌ల రోజున బాల‌య్య అభిమానులు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా డ‌ల్లాస్ అభిమానులు కార్ ర్యాలీ తీశారు. అదే విధంగా ఆస్ట్రేలియాలో అభిమానులు థియేట‌ర్ లో కేక్ క‌టింగ్ లు చేసి సంద‌డి చేశారు. ఇక ఏపీలో థియేట‌ర్ల వ‌ద్ద చాలా మంది అభిమానులు అఖండ లో బాల‌య్య గెటప్ లో వ‌చ్చి ఆక‌ట్టుకున్నారు.

akhanda lady fans dance

akhanda lady fans dance

అయితే బాల‌య్య‌కు కేవ‌లం మాస్ అభిమానులే ఉన్నార‌ని అంతా అనుకుంటారు కానీ బాల‌య్య‌కు అమ్మాయిలు కూడా ఫ్యాన్స్ ఉన్నార‌ని తాజాగా వైర‌ల్ అవుత‌న్న ఓ వీడియోతో అర్థం అవుతోంది. అఖండ సినిమా విడుద‌ల రోజున కొంత‌మంది అమ్మాయిలు ఏకంగా థియేట‌ర్ స్క్రీన్ పైకి ఎక్కి డ్యాన్స్ లు చేశారు. జై బాల‌య్య పాట‌కు థియేట‌ర్ లో కూర్చున్న లేడీ ఫ్యాన్స్ వ‌చ్చి జై బాల‌య్య అంటూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

Advertisement

BALAYYA AKHANDA

BALAYYA AKHANDA

అంతే కాకుండా ఏ సినిమాకు అయినా కుర్రాళ్లు సినిమా స్క్రీన్ వ‌ద్ద‌కు వచ్చి డ్యాన్సులు చేయ‌డం…హార‌తులు ఇవ్వ‌డం కామ‌న్. కానీ మొద‌టి సారి ఇలా అమ్మాయిలు వ‌చ్చి స్టెప్పులు వేయ‌డంతో ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. దాంతో బాల‌య్య అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. బాల‌య్య రేంజ్ అంటే అలానే ఉంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే అఖండ సినిమాకు స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమాలో ముఖ్యంగా ఫైట్ లు మ‌రియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అధిరిపోయాయంటూ రివ్యూలు వ‌స్తున్నాయి. ఇక క‌రోనా త‌ర‌వాత విడుద‌లైన పెద్ద సినిమా అఖండ యే కావ‌డంతో సినిమా ల‌వ‌ర్స్ క్యూ క‌డుతున్నారు.

Also read : ముగ్గురికి లైఫ్ ఇచ్చిన “నీకోసం”గురించి విష‌యాలు ఈ తెలుసుకోవాల్సిందే..!

Visitors Are Also Reading