Home » ముగ్గురికి లైఫ్ ఇచ్చిన “నీకోసం”గురించి విష‌యాలు ఈ తెలుసుకోవాల్సిందే..!

ముగ్గురికి లైఫ్ ఇచ్చిన “నీకోసం”గురించి విష‌యాలు ఈ తెలుసుకోవాల్సిందే..!

by AJAY
Ad

కొన్ని సినిమాలు హీరోల‌కు మాత్ర‌మే లైఫ్ ఇస్తాయి. కానీ కొన్ని సినిమాలు హీరోతో పాటూ మ‌రికొంత‌మందికి కూడా క్రేజ్ తెచ్చిపెడ‌తాయి. అలాంటి సినిమానే నీకోసం అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించారు. ఈ సినిమాకు టాప్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాతోనే ర‌వితేజ హీరోగా ప‌రిచ‌యం అవ్వ‌గా శ్రీనువైట్ల‌కు కూడా ఇదే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. ఈ సినిమాకు ముందు శ్రీను వైట్ల రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రికొంద‌రు దర్శ‌కుల ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు. ర‌వితేజ సైడ్ క్యారెక్ట‌ర్ లు చేస్తున్నాడు. శ్రీను వైట్ల అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న‌ప్పుడే నీకోసం క‌థ‌ను రాసుకున్నాడు. అంతే కాకుండా ఆ సినిమాలో మొద‌ట హీరోగా జేడీ చ‌క్ర‌వ‌ర్తి ని అనుకున్నాడు.

raviteja neekosam movie

raviteja neekosam movie

జేడీకి అప్ప‌టికే గులాభీ అలాంటి హిట్ ప‌డ‌టంతో అత‌డి రేంజ్ పెరిగిపోయింది. దాంతో జేడీ త‌న సినిమా చేసే అవ‌కాశం లేద‌ని నిరాశ చెందాడు. ఈ క్ర‌మంలో ఓ నిర్మాత శ్రీను వైట్ల‌తో సినిమా చేసేందుకు ముందుకు వ‌చ్చాడు. కేవ‌లం 40ల‌క్ష‌ల బ‌డ్జెట్ లో సినిమా చేయాల‌న్నాడు. దాంతో అలా అయితే కొత్త వారితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని సైడ్ క్యారెక్ట‌ర్ లు చేస్తున్న ర‌వితేజ ను హీరోగా ఎంపిక చేసుకున్నాడు.

Advertisement

Advertisement

raviteja srinu vaitla

raviteja srinu vaitla

అంతే కాకుండా ఈ చిత్రానికి ఆర్పీ ప‌ట్నాయ‌క్ తో స్వ‌రాలు అందించాడు. మొత్తానికి అనుకున్న బ‌డ్జెట్ కంటే ఓ ప‌ది ల‌క్ష‌లు ఎక్కువే అయ్యింది. కానీ సినిమా చూసిన త‌ర‌వాత రామోజీరావు ఏకంగా 80 కోట్లు పెట్టి సినిమా రైట్స్ ను కొనుగోలు చేశాడు. ఇక ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌గా కోటి రూపాయ‌ల కంటే ఎక్కువే క‌లెక్ట్ చేసింది.

rp patnaik

rp patnaik

ఇక ఈ సినిమా త‌ర‌వాత రామోజీరావు త‌న సొంత బ్యానర్ లో శ్రీనువైట్ల‌కు ఆనందం సినిమా చేసే అవ‌కాశం ఇచ్చాడు. ర‌వితేజ కు ఇట్లు శ్రావ‌ణి సుభ్రమ‌ణ్యం చేసే అవ‌కాశం ద‌క్కింది. అంతే కాకుండా ఆర్పీ ప‌ట్నాయ‌క్ కు మ‌న‌సంతా నువ్వే….నువ్వు నేను లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు సంగీతం అందించే ఛాన్స్ ద‌క్కింది. అలా మీకోసం సినిమా ర‌వితేజ‌, శ్రీనువైట్ల‌, ఆర్పీ ప‌ట్నాయ‌క్ ల స్టార్ ను మార్చేసింది.

Also read : సిరివెన్నెల ఇద్దరు కుమారులు తండ్రికి తగ్గ తనయులు…ఏం చేస్తున్నారో తెలుసా…?

Visitors Are Also Reading