మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రోజగోపాల్‌రెడ్డి ఇటీవల రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక త్వరలోనే జరుగనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి భవిష్యత్ లో జరిగే ఎన్నికలకు పట్టు సాధించాలని రాజకీయ పార్టీలన్ని ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ కి ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక కోసం ఈసారి కేసీఆర్ టికెట్ ఎవరికీ ఇస్తారని అందరూ టెన్షన్ పడుతున్న వేళలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మునుగోడులో కూసుకుంట్లకు అంత పాపులారిటీ లేదు. అందులో టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గర పోరు నడుస్తోంది. దీంతో ఆయనకే మళ్లీ టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతాం అని టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల వైపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ శ్రేణుల గోడును కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నల్లగొండ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అందులో మునుగోడు అభ్యర్థి కూసుకుంట్లనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు హింట్ ఇచ్చారు.
Advertisement
Advertisement
కూసుకుంట్ల స్వల్ప తేడాతోనే 2018 ఎన్నికల్లో ఓడిపోయాడని కేసీఆర్ చెబుతున్నప్పటికీ 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో కూసుకుం్ల 22వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. అది కొద్ది తేడా మాత్రం కాదు.. మరోవైపు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి కూడా మునుగోడు టికెట్ ఆశిస్తున్నాడు. దీంతో కేసీఆర్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై వేరే రూపంలో ఆయనకు పార్టీ స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారట. ఇక మునుగోడు టికెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఉప ఎన్నికల్లో మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య రసవత్త పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఈసారి పార్టీలు వేరైనా విజయం ఎవరినీ వరిస్తుందో వేచి చూడాలి మరి.
Also Read :
Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలు పాటిస్తే మీకు తిరుగుండదు..!
తన ఆస్తి మొత్తాన్ని గుళ్లకు, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన ఈ నటి గురించి మీకు తెలుసా..?