Home » Kurchi Tata : అల్లుఅర్జున్ సినిమాలో కుర్చీ మడతపెట్టిన తాత ?

Kurchi Tata : అల్లుఅర్జున్ సినిమాలో కుర్చీ మడతపెట్టిన తాత ?

by Bunty
Ad

 

Kurchi Tata : కాలా పాషా ఈ పేరు చెబితే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ కుర్చీ తాత అనగానే ఇతన్ని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. కుర్చీ తాతగా కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యారు. తన డైలాగ్స్ తో సినిమాల్లో వరుసగా అవకాశాలను అందుకునేటట్టుగా కనిపిస్తున్నారు. తన టాలెంట్ తో ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని షాక్ అయ్యేలా చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను గుంటూరు కారం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Kurchi Tata got chance in allu arjun movie

Kurchi Tata got chance in allu arjun movie

ఈ సినిమాలో తన డైలాగుతో మొదలయ్యే పాటలో తన లైన్స్ ని తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. తమన్ ఆధ్వర్యంలో ప్రసాద్ రికార్డింగ్స్ స్టూడియోలో కుర్చీని మడతంటూ ఊగిపోయాడు. ఆ పాటలో మహేష్ బాబు, శ్రీ లీల మాస్ స్టెప్స్ తో అలరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటను నిన్న రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ పాటలో కుర్చీ తాత ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు.

Advertisement

అయితే ఈ పాటపై రియాక్ట్ అయిన కుర్చీ తాత ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తనకు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో తాను నటించబోతున్నట్లు చెప్పాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అదృష్టం అంటే నీదే తాత…. అదృష్టం నీకు జిడ్డులా పట్టుకుంది అని అంటున్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ తాత గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading