Home » సోషల్ మీడియాలో కేటీఆర్ పోస్ట్ వైరల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

సోషల్ మీడియాలో కేటీఆర్ పోస్ట్ వైరల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

సాధారణంగా సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఏదైనా పోస్ట్ చేస్తే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. అది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అందుకు నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో చేసిన  ఓ పోస్ట్ కి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంతకు కేటీఆర్ ఏం పోస్ట్ చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కేటీఆర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి సాయం అందిస్తూ నిత్యం ట్రెండింగ్ లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా కేటీఆర్ ఎప్పుడు ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సాయం చేస్తుంటారు.ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాదు.. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. పోస్ట్ పై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

Advertisement

తాజాగా కేటీఆర్ తన ఇంట్లో వర్కౌట్స్ చేస్తూ ఓ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. కేటీఆర్ ఇలా వర్కౌట్స్ చేస్తూ చెమట చిందిస్తున్న ఫోటోను షేర్ చేయగా.. చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ కొందరూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరూ సార్ మీరు సినిమాల్లోకి రావాలి. ఓ యాక్షన్ సినిమాలో నటించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఓ పవర్ పుల్ రోల్ చేయండి సార్ అంటూ కామెంట్స్ చేశాడు. 

Also Read :  టాలీవుడ్‌ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూసారా.. ?

Visitors Are Also Reading