సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయన చేసిన సినిమాలే కారణం. అయితే అలా రజిని సినీ కెరియర్ లో ఉండే సూపర్ హిట్ సినిమాలలో నరసింహ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమాకు కే.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించగా… రజినికి జంటగా సౌందర నటించింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటుగా విలన్ గ నటించిన నీలాంబరి పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించి మంచి మార్కులు కొట్టేసింది. అసలు ఈ సినిమా విజయంలో ఈ పాత్రదే కీ రోల్ పోషించింది.
Advertisement
అయితే దర్శకుడు రవికుమార్ తాజాగా పాల్గొన ఇంటర్వ్యూ లో నరసింహ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. ఈ సినిమా స్టోరీ అనుకున్న తర్వాత ఇందులో నీలాంబరి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాము. మొదట మీనాను అనుకున్నాము. కానీ అంత పొగరు పాత్రలో ఆమె సూట్ కాదు అనుకోని.. నగ్మాతో చేయాలి అనుకున్నాము. కానీ ఆమె డేట్స్ దొరకలేదు. చివారకు రమ్యకృష్ణకు ఈ సినిమా కథ చెప్పం. మొదట రజిని వ్యతిరేకంగా ఆ పాత్ర చేయడానికి ఆలోచించిన రమ్య తర్వాత ఒప్పుకుంది.
Advertisement
అయితే ఇందులో రమ్యకృష్ణ రజినీకాంత్ ను ప్రేమిస్తే.. రజినీకాంత్ మాత్రం రమ్య దగ్గ పని చేసే సౌందర్యను ప్రేమిస్తాడు. దాంతో రజినీకాంత్ ను ఎలాగైనా దకించుకోవాలని నాటకం ఆడి తన పెళ్లి అతనితో ఫిక్స్ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన సౌదర్య చాలా డల్ గా రమ్యకృష్ణ కాళ్ళు పెడుతుంటే.. తన కాలిని సౌందర్య మొఖం మీద ఉంచి పక్కకు తిప్పాలి. అయితే ఈ సీన్ చేయడానికి రమ్యకృష్ణ అసలు ఒప్పుకోలేదు. బలవంత చేసిన తర్వాత ఏడ్చేసింది కూడా.. కానీ చివరకు సౌందర్య, రజినీకాంత ఇలా అందరూ చెప్పేసరికి ఒప్పుకుంది అని రవికుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
పంత్ ను వెనుకేసుకొచ్చిన గంగూలీ…!
సచిల్ లాగే వయస్సులో పెద్దవారైన భార్యలు ఉన్న క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా…?