Home » సచిల్ లాగే వయస్సులో పెద్దవారైన భార్యలు ఉన్న క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా…?

సచిల్ లాగే వయస్సులో పెద్దవారైన భార్యలు ఉన్న క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా…?

by Azhar
Ad

మన ఇండియాలో పెళ్లి అంటే అబ్బాయికి అమ్మాయి కంటే ఎక్కువ వయస్సు ఉండాలి అని అందరూ చూస్తారు. కానీ ఈ మధ్య ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే విధంగా భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనకంటే 5 ఏళ్ళు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఇది పెద్ద న్యూస్ అయింది. కానీ సచిన్ లాగే వయస్సులో పెద్దవారిని ఇంకా చాలా మంది క్రికెటలు చేసుకున్నారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్ట్ లోకే వస్తాడు. విరాట్ తన భార్య అనుష్క శర్మ ఒక్కే ఏడాదిలో జన్మించిన.. అనుష్క విరాట్ కంటే 6 నెలలు పెద్దది.

Advertisement

అదే విధంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య కంటే తన భార్య అయిన సెర్బియన్ నటి, మోడల్ నటాశా స్టాంకోవిక్‌ రెండేళ్లు పెద్దది. మిస్టర్ ఐపీఎల్‌ గా ఇండియా బెస్ట్ ఫీల్డర్ గా గుర్తింపు తెచుకున్న సురేశ్ రైనా కూడా ఇదే కోవాకు చెందినవాడు. రైనా భార్య ప్రియాంక చౌదరి వయస్సులో భర్త కంటే నాలుగు నెలలు పెద్దది. భారత జట్టు సేథ్ ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రిత్ బుమ్రా స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని గత ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. అయితే బుమ్రా కంటే సంజన గణేశన్ వయస్సు 3 ఏళ్ళు ఎక్కువ. ఇక మరో స్పోర్ట్స్ యాంకర్ మయంతి లంగర్‌ను పెళ్లి చేసుకున్నాడు భారత మాజీ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ. ఈ ఇద్దరు ఒక్కే సంవత్సరంలో పుట్టినా మయంతినే నాలుగు నెలలు పెద్దది. వీరికి 2020 లో బాబు పుట్టాడు. అప్పటి నుండి మయంతి యాంకరింగ్ కు దూరంగా ఉంటుంది.

Advertisement

ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సూపర్ పెరఫార్మెన్స్ ఇచ్చిన బ్యాటర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్ గౌతమ్‌ను భర్త కంటే నాలుగేళ్లు పెద్దది. ఈమె టెన్నిస్ ప్లేయర్ కూడా. భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ పెళ్లి చేసుకున్న జయంతి తన కంటే వయస్సులో 9 ఏళ్లు పెద్దది. అదే విధంగా భారత జట్టు తరపున తేసులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు… ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ అనిల్ కుంబ్లే చేతనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కుంబ్లే కంటే చేతన వయస్సు రెండేళ్లు ఎక్కువ.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పై తండ్రి ఎమోషల్..!

ప్లే ఆఫ్స్ కు వరుణుడు అడ్డుపడితే ఏం జరుగుతుంది..?

Visitors Are Also Reading