టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలియని వారు ఉండరు. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అంత ఎత్తు ఎగిరిన కృతి శెట్టి కి ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఈ భామ ఈ మధ్య నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి. అయినా ధైర్యం చెడని ఈ తుళు అందం వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది.
Advertisement
ఉప్పెనతో ఓ రేంజ్ కి వెళ్ళిన కృతి శెట్టికి ప్రస్తుతం అంతా బ్యాడ్ జరుగుతుంది. ఇది ఎలా ఉంటే ఈ మధ్యకృతి ఫేస్ లో కాస్తమార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ పై కృతి శెట్టి స్పందించింది. ఆమె మాట్లాడుతూ… ఇలాంటివి ఎవరూ రాస్తారో, ఎందుకు రాస్తారు కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు మా ఫ్యామిలీస్ కు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
Advertisement
ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయని వివరించారు. అంతమాత్రాన ప్లాస్టిక్ సర్జరీ అంటారా… ఇదేంటని మండిపడుతున్నారు ఈ తుళు అందం. ఇక కృతి కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
కాంగ్రెస్ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్..క్లారిటీ ఇదే
చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ విడాకులు ఇస్తున్నాడు – సీఎం జగన్