తెలుగులో ఇద్దరు శతాదిక చిత్రాల దర్శకులను అందించిన ఘనత ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత కే.రాఘవ గారికే దక్కుతుంది. ముఖ్యంగా రాఘవ నిర్మించిన తాత మనవడుతో దాసరి నారాయణరావు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణ దర్శకులుగా పరిచయమయ్యారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే దాసరి నారాయణ శిశ్యుడు రామకృష్ణ. గురు శిష్యుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని దర్శకులుగా చేసి తెలుగు సినిమాలకు ఎంతో ఉపకారం చేశారు రాఘవ .
ఇవి కూడా చదవండి: మీ శరీరం, నోటి నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే మటుమాయం..!
Advertisement
ఇంట్లో భార్య అంటే విపరీతమైన అభిమానం కనబరుస్తూ.. మరో స్త్రీ మాట తలపెట్టకుండా బయటికి వెళ్లగానే దర్శకుని అవతారమెత్తి పరాయి స్త్రీలతో ఆనందం కోసం వెంపర్లాడే మగవాడిని ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనడం కాదు.. ఆ నానుడినే ప్రధాన అంశంగా తీసుకొని అదే టైటిల్‌తో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1982 ఏప్రిల్ 23న విడుదలైంది. తొలుత ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత కాలక్రమేణా ప్రేక్షకాధరణ పెరిగి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 512వ రోజు సినిమాగా నిలిచింది. అప్పటికే యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవిని రాజశేఖర్ అనే హాస్యం మెళవించిన ఫ్యామిలీ క్యారెక్టర్ లో మెప్పించడం ఆశామాషి విషయం కాదు.
ఇవి కూడా చదవండి: కోహ్లీ ఓ భిన్నమైన కెప్టెన్… అతను..?
Advertisement
ఆయన కెరీర్లో మంచి చిత్రాల్లో ముందు వరుసలో ఉంటుంది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. చిరంజీవి సరసన నాయికగా జయ పాత్రలో నటించిన మాధవి కథకు కీలకమైన పాత్రలో పూర్ణిమ నటించిన ఈ చిత్రం ద్వారా సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా పరిచయమయ్యారు. అమాయక స్త్రీలను మాటలతో లోబరుచుకుని జల్సా చేసే సుబ్బారావు పాత్రను గొల్లపూడి పోషించాడు. ఇవాళ ఒక సినిమా షూటింగ్ అంటే వంద రోజులు చాలడం లేదు. ప్రస్తుతం 150 నుంచి 200 రోజులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటిది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాని కేవలం 29 పని దినాల్లో పూర్తి చేశారు రాఘవ గారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూ.3లక్షల 20వేల వ్యయమైన ఈ చిత్రానికి పాలకొల్లు, నర్సాపురం, పోడూరు, సకినేటిపల్లి, భీమవరం, మద్రాస్‌ల్లో సినిమా షూటింగ్ జరిపారు. సినిమా పూర్తయ్యాక సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కున్న రాఘవ పట్టు వదలకుండా పోరాడి వాటి నుంచి బయటపడ్డారు. జే.వీ.రాఘవులు స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సీ.నారాయనరెడ్డి రాయగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణం, పి.సుశీల గానం చేశారు. ఈ సినిమాలోని పాటలు అప్పట్ల జనాధారణ పొందాయి. ఈ సినిమాతో గట్టి పునాది వేసుకున్న దర్శకుడు కోడిరామకృష్ణ ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Also Read : ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!