టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతో మంది అగ్రహీరోలతో నటించి మన్ననలు పొందారు. 2017లో నక్షత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగమార్తాండ.
దాదాపు నాలుగేళ్ల తరువాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న తరుణంలో కృష్ణవంశీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కృష్ణవంశీ తన వ్యక్తి గత విషయాల గురించి కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మ్యారేజ్ రూమర్స్ పై స్పందించారు. తనకు బాధ్యతలు అంటే చాలా భయం అని, తాను పెళ్లి చేసుకోవాలని, జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలుండేవి కాదని వెల్లడించారు. అనుకోకుండా తన జీవితంలోకి రమ్యకృష్ణ వచ్చిందని వెల్లడించారు కృష్ణవంశీ. తాను నా జీవితంలోకి వచ్చిన తరువాత మా ఇద్దరికీ ఓ కుమారుడు కలిగాడని.. మా జీవితంలో ఈ మార్పు తప్ప మరెలాంటి మార్పు లేదని వివరించారు.
Advertisement
Advertisement
ముఖ్యంగా రమ్యకృష్ణ నన్ను నన్నులాగా ఉండనిచ్చిందని.. పెళ్లి అయిన తరువాత నా జీవితాన్ని బ్రతికాను. మరోవైపు రమ్యకృష్ణతో డబ్బు విషయంలో విభేదాలు వచ్చాయని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై కృష్ణవంశీ స్పందిస్తూ.. సెలబ్రెటీలు అన్నప్పుడు ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మేము నవ్వుకుంటాం. ఇలా తప్పుగా ఆలోచిస్తారని అసలు అనుకోలేదని చెప్పారు. రమ్యకృష్ణతో విడాకుల విషయంపై స్పందించి ఇందులో ఎలాంటి లేదని సమాధానం ఇచ్చారు.
Also Read :
భార్య భర్తలు జీవితంలో ఈ 10 తప్పులు అస్సలు చేయకూడదట….! చేస్తే ఏం జరుగుతుందంటే..?
ఇక నుంచి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే జైలుకే..!