Telugu News » Blog » భార్య భర్తలు జీవితంలో ఈ 10 తప్పులు అస్సలు చేయకూడదట….! చేస్తే ఏం జరుగుతుందంటే..?

భార్య భర్తలు జీవితంలో ఈ 10 తప్పులు అస్సలు చేయకూడదట….! చేస్తే ఏం జరుగుతుందంటే..?

by AJAY
Published: Last Updated on
Ads

పెళ్లి తర్వాత జీవితం బాగుండాలంటే భార్య భర్తలు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి అనే విషయాన్ని కచ్చితంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలిసి ఉండాలి. జీవితంలో చేసే కొన్ని తప్పులు దాంపత్య జీవితంలో కుంపటిగా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… దురాశ ఉంటే ఆ కాపురంలో గొడవలు తప్పవు.

Advertisement

భార్యకు గాని భర్తకు గాని డబ్బుపై వ్యామోహం ఉంటే ఆ కాపురాలు నిలబడవు కాబట్టి అలా కోరికలు ఉంటే వాటిని అదుపు చేసుకోవాలి. జీవిత భాగస్వామిని కేవలం శృంగా* పరంగా చూడకుండా ప్రేమగా చూడటం మొదలుపెట్టాలి. అలాంటప్పుడే భార్యాభర్తల దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది. భార్యాభర్తల్లో ఇద్దరిలో ఏ ఒక్కరికి అహంకారం ఉన్నా కూడా అది గొడవలకు దారితీస్తుంది.

Advertisement

నేనే గొప్ప అని భార్య అయినా భర్త అయినా విర్రవీగకూడదు. అలా చేస్తే కాపురంలో గొడవలు మొదలై విడాకులకు దారి తీసే అవకాశం ఉంటుంది. భార్య కానీ భర్త కానీ సోమరితనంగా వ్యవహరించకూడదు. ఇంటి అవసరాల కోసం ఇద్దరు పని చేయాల్సి ఉంటుంది. ఎవరి పని వారు చేయకపోయినా కాపురంలో గొడవలు మొదలై విడిపోయే స్థితి వరకు వెళుతుంది. పెళ్లికి ముందు కోపముంటే పెళ్లయిన తర్వాత మాత్రం దాన్ని తగ్గించుకోవాలి.

Advertisement

లేదంటే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల కాపురాలు చీలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భార్యకు అయినా భర్తకు అయినా కోపం ఉంటే దాన్ని తగ్గించుకుని శాంతంగా వ్యవహరించాలి. కూల్ గా ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలి. భార్య మీద భర్తకు ….భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు కాబట్టి అనుమానాలతో ఒకరినొకరు దూరం చేసుకోకుండా కలిసి ఉండాలంటే మొదట ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి.