టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్ లలో కృష్ణవంశీ ఒకరు. అయితే చాలా ఏళ్లుగా కృష్ణవంశీకి సరైన హిట్ పడలేదు. కానీ తాజాగా ఆయన తెరకెక్కించిన రంగమార్తాండ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించారు.
ALSO READ: ఆ రెండు కారణాల వల్లనే బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా ?
Advertisement
అదేవిధంగా ఈ సినిమాలో అనసూయ, రాహుల్ సిప్లింగజ్, ఆదర్శ్ లు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ పాత్రను ఈ సినిమా కోసం పవర్ ఫుల్ గా డిజైన్ చేశానని చెప్పారు. ఇంట్లో ఏ నిర్నయమైనా తన భార్యనే తీసుకుంటుందన్నారు. రమ్యకృష్ణకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయని ఆమె కళ్లతోనే నటించగలదని అన్నారు.
Advertisement
రమ్యకృష్ణ ఒక విజన్ తో ముందుకెళుతుందని…ఈ సినిమా కోసం తన మేకప్ వేసుకుందని, హెయిర్ స్టైల్ తనే చేసుకుందన్నారు. ఈ సినిమాలో చివరి చాప్టర్ షూటింగ్ చేయడానికి చచ్చిపోయాననుకో అంటూ కామెంట్ చేశారు.
36 గంటల పాటూ షూటింగ్ జరిగిందని, రమ్యకృష్ణను ఆ సీన్ లో చిత్రించడానికి సెంటిమెంట్ అడ్డొంచిదనిఅన్నారు. కానీ తప్పదు కాబట్టి షూట్ చేశానని అన్నారు. ఆ సీన్ చిత్రిస్తున్నప్పుడు కళ్ల నుండి నీళ్లు వచ్చాయని తెలిపారు. రోజు రాత్రి నిద్రపట్టలేదని ఎమోషనల్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే గుండె రాయి అయ్యిందన్నారు.
ALSO READ : NTR నుంచి మనోజ్ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్లు ?