Home » “భక్త కన్నప్ప” సినిమా కోసం కృష్ణం రాజు అంత చేశారా? అసలు ఈ సినిమా బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాక్!

“భక్త కన్నప్ప” సినిమా కోసం కృష్ణం రాజు అంత చేశారా? అసలు ఈ సినిమా బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాక్!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

నిన్నటి జనరేషన్ హీరోల్లో కృష్ణంరాజుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు ఆయన ఎక్కువ యాక్షన్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపేవారు. అలాంటిది కృష్ణం రాజు నుంచి ఓ భక్తి రసాత్మక చిత్రం అంటే అప్పట్లోనే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చివరకు ఇది కృష్ణం రాజు కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది.

Advertisement

కృష్ణం రాజు ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలను చూసేవారట. బెన్హార్, టెన్ కమాండమెంట్స్ వంటి సినిమాలను ఆయన ఎక్కువసార్లు చూసారు. తెలుగులో కూడా ఆ స్థాయిలో సినిమాలు తీయాలని భావించి దర్శకుడు బాపుకు ఓ పౌరాణిక కథను వినిపించారట. అయితే..ఈ కథలో కొన్ని మార్పులు చేయాలనీ, ఆ పనిని బాపు ముళ్ళపూడి వెంకట రమణకు చెప్పారట. అయితే.. అనుకున్న ప్రకారంగా ఎమోషన్ సీన్స్ తో పాటు కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలను కూడా రమణ రాసుకున్నారు.

Advertisement

ఇది వారి సంస్థలో తొలి పౌరాణికం కావడంతో పూర్తిగా అవుట్ డోర్ లో భారీ ఎత్తున సెట్ వేయించారు. దీనికోసం కృష్ణం రాజు చాలా ఖర్చు చేశారట. ఆ రోజుల్లోనే ఈ సినిమా బడ్జెట్ ఇరవై లక్షలు పైనే అయ్యిందట. ఈ ఖర్చు కృష్ణం రాజే పెట్టుకున్నారట. ఒక్క కైలాసం సీన్ తప్ప మిగతా అన్ని సీన్స్ లను పట్టిసీమ, బుట్టాయిగూడెం ప్రాంతాలలో షూట్ చేసారు. 500 లకు పైగా ఉన్న యూనిట్ సభ్యులతో 70 రోజుల పాటు షూటింగ్ చేసారు. ఆదివారం మాత్రం సెలవు తీసుకుని యూనిట్ అంతా సంతోషంగా గడిపేవారట. షూటింగ్ జరిగినంత కాలం పెళ్లి భోజనం తలపించేలా అందరికి భోజనం అందించారట. ఎంతమంది ఎన్ని చెప్పినా కృష్ణం రాజు వెనక్కి తగ్గలేదట. అలా రిలీజ్ అయినా ఈ సినిమా ఎంత విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.

మరిన్ని ముఖ్య వార్తలు:

 Allu Arjun: సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఆ పని చేసేవాడా? మొదటి సంపాదన ఎంతంటే?

“భగవంత్ కేసరి” సినిమాకు ముందు హీరోగా అనుకున్నది బాలకృష్ణను కాదా? ముసలోళ్ల కథ అంటూ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో?

Visitors Are Also Reading