సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమ తరలివచ్చి కృష్ణకు అశృనివాళి అర్పించింది. తెలుగు హీరోలంతా వచ్చి కృష్ణ భౌతిక కాయానికి ఘ నివాళి అర్పించారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు. దర్శకులు, నిర్మాతలు సైతం కృష్ణ కడసారి చూపుల కోసం వచ్చారు. ఇండస్ట్రీలో కృష్ణ మంచితనానికి మారు పేరు. ఎంతోమందికి సాయపడ్డారు. డబ్బులకు విలువ ఇవ్వకుండా మనుషులకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు. అందుకే కృష్ణవేల కోట్ల ఆస్తులు సంపాదించకపోయినప్పటికీ.. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.
Advertisement
అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి కన్నా ఎక్కువగా పారితోషికం తీసుకున్న సినిమాలు చాాలానే ఉన్నాయి. డబ్బుని ఆదా చేయలేని సూపర్ స్టార్ కృష్ణ ..స్నేహితులకి విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు. దాదాపుగా అడిగిన వాళ్లకు లేదనకుండా ఇచ్చేవారు. కృష్ణ నుంచి డబ్బులు తీసుకున్నవాళ్లు తిరిగి ఆయనకు ఇచ్చేవారు కాదట. మహేష్ తల్లి ఇందిరా దేవీకి, కృష్ణకు ఇదే విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. మహేష్ బాబు కూడా తన తండ్రి అంత మంచితనంగా మాత్రం అస్సలు ఉండకూడదని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు.
Advertisement
Also Read : భర్త మరణాన్ని జీర్ణించుకునేలోపే అత్తామామలు మృతి..! రమేష్ బాబు భార్య జీవితంలో ఇన్ని కష్టాలా..!
తన కెరియర్ లో సినిమాలో ఆపేసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దగ్గర లాస్ట్ కు మిగిలింది రూ.400 కోట్లు మాత్రమే అట. అయితే ఆయన వీలునామాలో ఈ రూ. 400 కోట్ల ఆస్తిని తన మనవళ్లు, మనవరాలుకు సమానంగా పంచాలని రాసి పెట్టారట. కృష్ణ ఆస్తి మొత్తం కొడుకులు, కూతుళ్లకు కాకుండా మనవళ్లు, మనవరాలళ్లకే రాసిచ్చారు. దీంతో నరేష్‌కు మాత్రం ఒక్క రూపాయి కూడా దక్కలేదు. నరేష్ విజయ్ నిర్మల కొడుకు. కృష్ణ విజయ్ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, విజయ్ నిర్మల పెళ్లైన దగ్గర నుంచి నరేష్ కూడా వారితోనే ఉంటున్నారు. విజయ్ నిర్మల మరణించిన తర్వాత కూడా నరేష్ కృష్ణతోనే ఉన్నారు. అయితే నరేష్‌కు కృష్ణ ఆస్తి రాకపోయినా.. విజయ్ నిర్మల నుంచి వచ్చిన ఆస్తి మాత్రం వందల కోట్లలోనే ఉందని సమాచారం.
Also Read : కృష్ణ పేరిట ఉన్న 19 రికార్డులు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!