Home » కృష్ణ పేరిట ఉన్న 19 రికార్డులు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!

కృష్ణ పేరిట ఉన్న 19 రికార్డులు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఎదిగారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారి సినిమాలు అంటేనే కొన్ని ప్రత్యేకతలు సంతరించుకునేవి. అలాంటి కృష్ణ 340కి పైగా చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు. కోట్లాది ఆస్తులు సంపాదించారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఎన్ని రికార్డులు సాధించారో ఇప్పుడు చూద్దాం..

Advertisement

 

also read:కృష ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా చిరంజీవి కొనసాగాడనే విషయం మీకు తెలుసా ?

#1. 350కి పైగా సినిమాల్లో నటించిన మొదటి హీరో కృష్ణ.
#2. 1983లో ఒకే నగరం అయిన విజయవాడలో 6 చిత్రాల శత దినోత్సవం నిర్వహించిన ఏకైక ఇండియన్ హీరో కృష్ణ.
#3. తమిళంలోకి డబ్ అయిన సినిమాలు:20.
#4. హిందీలోకి డబ్ అయిన సినిమాలు:10
#5. దర్శకత్వం వహించిన సినిమాలు:16
#6. అత్యధికంగా కృష్ణ నటించిన 18 సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరం 1972
#7. కృష్ణ నటించిన మల్టీ స్టారర్ సినిమాలు 50
#8. కె.ఎస్.ఆర్.దాసు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు 31
#9. కృష్ణతో పనిచేసిన సంగీత దర్శకులు 52

Advertisement

#10. 1965 నుంచి 2009 వరకు 44 ఏళ్లు ఏ సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ.
#11. 44 ఏళ్లలో సంక్రాంతి రోజున రిలీజ్ అయిన సినిమాలు 30.
#12. కృష్ణ మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా సింహాసనం. రిలీజైన థియేటర్లు 153.
#13.కృష్ణ విజయనిర్మల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు 50.
#14. జయప్రద కాంబినేషన్లో వచ్చిన సినిమాలు 43.
#15. శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు 31
#16. కృష్ణతో నటించిన హీరోయిన్ల సంఖ్య 80
#17. దీపాత్రాభినయం చేసిన సినిమాలు 25.
#18. త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 7
#19. అభిమాన సంఘాల సంఖ్య 2500 కు పైగానే ఉన్నాయట. ఈ విధంగా కృష్ణ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సాధించారు.

also read:ఆ అర్థరాత్రి జమున గది తలుపు తట్టిన ఎస్వి రంగారావు.. ఏం చెప్పారో తెలుసా..?

Visitors Are Also Reading