తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా
నటీనటులు : వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాధిక శరత్ కుమార్, బ్రహ్మాజీ
దర్శకుడు: అనీష్ ఆర్ కృష్ణ
బ్యానర్: IRA క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్
also read:ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement
యువ కథానాయకుడు నాగ శౌర్య హీరోగా IRA క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ “కృష్ణ వ్రింద విహారి” అనేక అంచనాల నడుమ రిలీజ్ అయింది. మరి మూవీ నాగ శౌర్య కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి..
కథ:
కృష్ణ వ్రింద విహారి మూవీ మొదటి భాగంలో ఫ్యామిలీ డ్రామాతో చక్కని నాటకీయ సన్నివేశాలతో చాలా కూల్ గా సాగుతుంది. ఇందులో హీరో నాగశౌర్య రెండు పాటల్లో ఎప్పటిలాగే స్టైలిష్ గా కనిపిస్తారు.. మూవీ లవ్ తో మొదలై కుటుంబంలో అత్తాకోడళ్ల సన్నివేశాలతో సాగుతుంది. దర్శకుడు అనీష్ కృష్ణ రొటీన్ క్లైమాక్స్ మినహా అంతా బాగానే ఉంది. కొత్త అమ్మాయి “పెర్లి “పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు . ప్రస్తుత టెక్నాలజీలో ఉండే యువ జంట మధ్య వచ్చిన సంఘటన ఆధునిక అత్తా కోడళ్ళ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. తన ప్రేమికుడి సమస్యను కప్పిపుచ్చడం కోసం కృష్ణుడు చేసే పోరాటం ఫన్నీగా ఉంటుంది.
ఇక సెకండాఫ్ విషయానికి పక్కా ఫ్రెష్ కంటెంట్ తో అత్తా కోడళ్ళ కామెడీ అందరికీ నచ్చే విధంగా గుడ్ ఎండింగ్ తో ముగుస్తుంది.. ఓవరాల్ గా సినిమా ను అందరూ చూడవచ్చు.. కాదు చూసేయండి..
Advertisement
నటీనటుల పనితీరు :
మూవీలో రాధిక మరియు వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో తనదైన కామెడీ సన్నివేశాలతో అదరగొట్టేసారు. అలాగే మహతి స్వర సాగర్ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ప్లస్: సినిమాలోని సంగీతం ఎంతో ఆకట్టుకుంటుంది అలాగే కామెడీ సన్నివేశాలు ఇంకా బాగున్నాయి అని చెప్పవచ్చు.
మైనస్ : రొటీన్ క్లైమాక్స్, కొన్ని రొటీన్ సన్నివేశాలు ఉండటం.
Krishna Vrinda Vihari Review and Rating: రివ్యూ:
ఈ సినిమా మాత్రం కొత్త సినిమా కంటెంట్ అయితే కాదు.. అలాగని సినిమా బోర్ కొట్టదు.. పాత సినిమా కథ లాగే ఉన్నా ఫన్నీ సన్నివేశాలతో, ఫీల్ గుడ్ పాటలతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. కృష్ణ ఫ్యామిలీ తో హీరోయిన్ కలిసిపోయే సందర్భంలో పండించిన కామెడీ చాలా సహజంగా ఉంటుంది. మొదటి భాగం మొత్తం లవ్ చుట్టే తిరుగుతుంది. దీనికి తగ్గట్టు కథ ఇంకా కొంచెం బలంగా ఉంటే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళి పోయేది. ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ లో “ఏ ముందే” పాట అందరినీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, అలాగని చెత్తగా ఉందని కూడా చెప్పలేం. మొత్తానికి సినిమా చూడవచ్చు..
also read:మోక్షాజ్ఞ ఎంట్రీ తో ఎన్టీఆర్ మైలేజ్ తగ్గిపోతుందా…? నెట్టింట హాట్ టాపిక్..!