Home » మోక్షాజ్ఞ ఎంట్రీ తో ఎన్టీఆర్ మైలేజ్ త‌గ్గిపోతుందా…? నెట్టింట హాట్ టాపిక్..!

మోక్షాజ్ఞ ఎంట్రీ తో ఎన్టీఆర్ మైలేజ్ త‌గ్గిపోతుందా…? నెట్టింట హాట్ టాపిక్..!

by AJAY
Published: Last Updated on

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎదిగిన కొడుకులు ఉన్నట్లయితే వారి ఎంట్రీ పై అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే టాలీవుడ్ లోని స్టార్ హీరోల కుమారులంతా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీకాంత్ ఇలా ప్రతి హీరో కొడుకు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు ప్రేక్ష‌కుల దృష్టి అంతా నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు పైనే ఉంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఆ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తానని చెప్పాడు. కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉన్నాడని హీరో లుక్ కు రావాలని కూడా పలువురు అభిప్రాయపడుతుంటారు.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ గతంతో పోలిస్తే లుక్ పరంగా చాలా మారిపోయాడు. దాంతో త్వరలోనే ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా మోక్షజ్ఞ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ మరియు డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్ట్టు కూడా సమాచారం. దాంతో బాలయ్య మోక్షజ్ఞ కోసం కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

mokshagna

mokshagna

ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఎంట్రీ విషయం హాట్ టాపిక్ గా మారడంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఎన్టీఆర్ మైలేజ్ తగ్గిపోయే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ అలా జరిగే ఛాన్స్ లేదు ఎన్టీఆర్ ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా మోక్షజ్ఞ ఎన్టీఆర్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మోక్షజ్ఞ కుర్ర‌హీరోల‌తో పోటీపడతాడు.

Visitors Are Also Reading